Actor Uttej Believes Strong Reason behind Vijay's Death | విజయ్ మరణం వెనుక బలమైన కారణం ఉందంటున్న ఉత్తేజ్

Senior actor reacted on vijay s death

Vijay Suicide, Actor Uttej, Vijay Wife Vanitha, Actor Vijay Suicide, Comedian Vijay Death

Actor Cum Writer Utteja Reacts on Comedian Vijay's Suicide. He believes there is a Strong Reason behind Vijay's Death.

విజయ్ మరణంపై స్పందించిన నటుడు ఉత్తేజ్

Posted: 12/12/2017 03:53 PM IST
Senior actor reacted on vijay s death

నటుడు విజయ్ ఆత్మహత్యతో తెలుగు సినీపరిశ్రమ, ప్రేక్షక లోకం షాక్ కు గురైంది. టాలీవుడ్ కు చెందిన పలువురు విజయ్ భౌతికకాయాన్ని కడసారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ, విజయ్ ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఉండవచ్చని చెప్పాడు.

ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంతో ధైర్యం, తెగింపు కావాలని అన్నాడు. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయని చెప్పాడు. ఎన్ని సమస్యలు ఉన్నా తన తండ్రి చూసుకుంటాడని విజయ్ చెప్పేవాడని... చివరకు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కళల ప్రపంచంలో అందరూ సంతోషంగానే ఉంటారని... కానీ, నిజ జీవితంలో అలా ఉండదని అన్నాడు.

ఇక ఆయన భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు ఉత్తేజ్ నిరాకరించాడు. ఈ సాయంత్రం విజయ్ అంత్యక్రియలు జరగనున్న విషయం తెలిసిందే.

వనిత-సుబ్బారావు పరస్పర ఆరోపణలు.. 

వనితపై అన్ని ఆధారాలు, సరైన టైంలో బయటపెడతా వనితకు సంబంధించి తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని సుబ్బారావు చెప్పారు. సరైన సమయంలో ఆ ఆధారాలు బయటపెడతానని చెప్పారు. వనిత క్యారెక్టర్ మంచిది కాదని ఆరోపించారు. విజయ్ పిల్లల విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. విడిపోయినప్పటి నుంచి తన కొడుకును వేధిస్తోందన్నారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.సుబ్బారావు ఆరోపణలను ఖండించిన వనిత మరోవైపు సుబ్బారావు ఆరోపణలను వనిత ఖండించారు. ఆస్తి కోసం కన్న కొడుకును చంపుకున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను బలిపశువును చేసేందుకు విజయ్ తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. తనకు ఏమీ తెలియదన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles