టాలీవుడ్ లో ఆసక్తికర సబ్జెక్టుతో చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరును తక్కువ సమయంలోనే సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గరుడవేగ సక్సెస్ తర్వాత ఆయన రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తనతో ఓ చిత్రం ఉండబోతుందని హీరో నితిన్ స్వయంగా ప్రకటించినప్పటికీ.. ప్రవీణ్ తర్వాతి చిత్రంపై ఓ కన్ఫూజ్యన్ నెలకొంది.
ఆ మధ్య బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్ బయోపిక్ ను తెరకెక్కించాలనే ప్రయత్నించగా.. అది ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సత్తారు చిత్రం ఎవరితోనన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఇంతలో ఓ కొత్త అప్ డేట్ అందుతోంది. ముగ్గురు హీరోలతో ప్రవీణ్ సత్తారు ఓ మల్టీస్టారర్ ఫ్లాన్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. నితిన్ రానా ఇప్పటికే హీరోలుగా కన్ఫర్మ్ కాగా, నారా రోహిత్ ను మరో హీరోగా ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి త్రీ కజిన్ష్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అఫీషియల్ ప్రకటన వచ్చే దాకా ఈ ప్రాజెక్టుపై ఎలాంటి కంక్లూజన్ కి రాకపోవటం విశేషం. ఒకవేళ అదే నిజమైతే మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more