Varun Tej Tholi Prema First look Released | తొలి ప్రేమ ఫస్ట్ లుక్.. క్యూట్ లవ్ స్టోరీ లేదా లవ్ ఫెయిల్యూరా?

Varun tej new movie first look out

Varun Tej, Tholi Prema Movie, Tholi Prema First look, Raashi Khanna, Venky Atluri, Varun Tej Tholi Prema First look Poster, Tholi Prema 2018, Tholi Prema Release Date

Varun Tej Tholi Prema First look Released. The Makers Officially announced title with Poster. Raashi Khanna as lead pair under Venky Atluri Direction.

వరుణ్ తేజ్ తొలిప్రేమ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 12/04/2017 04:40 PM IST
Varun tej new movie first look out

మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ వచ్చేసింది. తొలిప్రేమ అంటూ టైటిల్ ను అనౌన్స్ చేసేశారు. కొంత కాలంగా ఈ చిత్రం టైటిల్ అదే నంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ మేకర్లు ఫస్ట్ లుక్ ను వదిలారు.

టైటిల్ తో పాటు బ్యాగ్రౌండ్ లో వరుణ్ ను కూడా చాలా కూల్ గా చూపించేశారు. ఓ పోస్టర్ లో ఫోన్ ను చూస్తూ చాక్లెట్ బాయ్ తరహాలో ఉన్న వరుణ్.. మరో యాంగిల్ లో బారెడు గడ్డంతో ఉన్న పోస్టర్లను ఆ మధ్య చూశాం. బహుశా లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మెచ్యూర్డ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఫిదా తర్వాత మరో డిఫరెంట్ ప్రేమ కథతో వరుణ్ రాబోతున్నాడని అర్థమౌతోంది.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న తొలిప్రేమలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. మరి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి వరుణ్ కూడా బిగ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh