Rajini Kaala Unofficial Release Date Announced | సూపర్ స్టార్ అభిమానులకు గ్రేట్ న్యూస్

Kaala movie release date

Rajinikanth Kaala Movie, Kaala Movie Release Date, Pa. Ranjith, Pa. Ranjith Movie Release Date, Kaala Release Date

Rajinikanth Kaala Movie Release Date Announced but, Not Officially. Pa Ranjith Directorial Venture

రజనీ కాలా రిలీజ్ డేట్ వచ్చేసింది

Posted: 12/02/2017 04:55 PM IST
Kaala movie release date

రజనీ - శంకర్ కాంబినేషన్లో రూపొందిన '2.0' జనవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వేసవికి వాయిదా పడింది. ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తలైవా ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో వారి కోసం ఓ గుడ్ న్యూస్.

పా రంజిత్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ హీరోగా 'కాలా' సినిమా రూపొందుతోంది. హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై, అందరిలోను ఆసక్తి వుంది. పవర్ ఫుల్ డాన్ గా రజనీకాంత్ కనిపించనున్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం.

రజనీకాంత్ .. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన 'కబాలి' భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో రజనీని కొత్తగా చూపించి రంజిత్ మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో ఆ తరువాత సినిమాను కూడా రజనీతోనే చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రానికి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  కాలా రిలీజ్ దాదాపు ఖరారు కావటంతో ఇక మిగిలింది అధికారిక ప్రకటనే.

రజనీ కాలా జీపుపై వాళ్ల కన్ను

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles