Injustice to Mega family in Nandi Awards | నంది అవార్డులు.. మెగా ఫ్యామిలీ అన్యాయం గురించి మాటేంటి?

Mega family faraway for nandi awards

Nandi Awards, Nandi Awards Mega Family, Nandi Awards Bunny Vasu, Bunny Vasu Mega Family, Mega Family Injustice Nandi Awards, Nandi Awards Nandamuri Awards

Bunny Vasu Frustration on Nandi Awards. Injustice to Mega family in Nandi Awards so many years.

నంది అవార్డులు.. మెగా ఫ్యామిలీ అన్యాయంపై బన్నీవాసు ప్రశ్నలు

Posted: 11/15/2017 04:29 PM IST
Mega family faraway for nandi awards

మూడేళ్లకు గానూ నంది అవార్డులను ప్రకటించగా.. మెగా హీరోలకు అందులో ప్రాధాన్యత లభించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో రెండు కమర్షియల్ హిట్లు అందించిన అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు లభించటంపై ఆ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే బన్నీవాసు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం ప్రకటించాడు. ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారని చెప్పాడు.ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని... చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని తెలిపాడు.

గతంలో మగధీర సినిమాకు కూడా అన్యాయం జరిగిందని... జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు అన్నాడు. కాగా, గీతా ఆర్ట్స్ గ్రూప్ లో బన్నీ వాసు కీలక వ్యక్తిగా ఉన్నాడు. కాగా, ఆయన చేసిన ఓ పోస్టు వివాదాస్పదం కాగా.. తర్వాత కాసేపటికే దానిని ఆయన డిలేట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles