Financial Troubles Bhojpuri film director Died | వరుస సినిమాలు ఫ్లాపు.. దర్శకుడి ఆత్మహత్య

Bhojpuri director suicide

Bhojpuri Director, Director Shad Kumar, Director Suicide, Swarg Movie, Swarg Director, Bhojpuri Director Suicide, Bhojpuri Director Shad Kumar

Bhojpuri film director Shad Kumar commits suicide at Mira Road home.Shad's film 'Swarg' was to release on November 24. Shad (49) was found hanging from the ceiling fan of his New Saloni Heights home in Mira Road. His wife was away when he took the extreme step. Shad is believed to have been reeling under debts. The Naya Nagar police registered a case of accidental death.

ఆర్థిక నష్టాలు.. భోజ్ పురి దర్శకుడి ఆత్మహత్య

Posted: 11/11/2017 08:56 AM IST
Bhojpuri director suicide

మరో సినీ దర్శకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భోజ్‌పురి చిత్రాల దర్శకుడు షాద్ కుమార్ (50) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ముంబై మిరా రోడ్డులోని తన నివాసంలో ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డారు.

49 ఏళ్ల షాద్ కుమార్ అసలు పేరు షంషాద్ అహ్మద్. మధ్యాహ్నం 1.40 గంటలకు న్యూ సలోనీ హైట్స్ కోఆపరేటివ్ సొసైటీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన షంషాద్ భార్య బానో షంషాద్ సీలింగ్‌కు వేలాడుతున్న భర్త మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పలు చిత్రాలు తీసి ఆర్థికంగా నష్టపోవడంతో గత కొంతకాలంగా తన భర్త తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు బోనా షంషాద్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షంషాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ లైలా’, ‘టీన్ చైలా’, ‘బెయిల్ తోహ్రా సె ప్యార్’, తుమ్హారే ప్యార్ కె కసమ్’ వంటి పలు భోజ్‌పురి చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆయన తాజా చిత్రం ‘స్వర్గ్’ ఈనెల 24న విడుదల కావాల్సి ఉంది. నారాయణ నగర్ పోలీసులు ప్రమాదవశాత్తూ మరణంగా కేసును నమోదు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles