Kollywood Top DOP Died with Heart Attack | సింగం సిరీస్ డీవోపీ కన్నుమూత, కీర్తి సురేష్ సహా పలువురి నివాళి

Kollywood top dop demise

Cinematographer Priyan, Saamy Square DOP, Kollywood Priyan, DOP Priyan, Keerthy Suresh, Director Hari Priyan Movies, Priyan Nagendran Carrier, Priyan Death News

Noted Tamil cinematographer Priyan (Nagendran) died on Thursday after a cardiac arrest at his residence in Chennai. Mr. Priyan started his career as an assistant in the camera unit of actor producer K. Balaji and worked with cinematographer-director Balu Mahendra in many films. He also worked with Director Hari along 13 Films. Now, He Also Doing Saamy Square which was sequel for Vikram's Block Buster Saamy.

ప్రముఖ కెమెరామన్ ప్రియన్ కన్నుమూత

Posted: 11/10/2017 11:09 AM IST
Kollywood top dop demise

కోలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రియన్ కన్నుమూశారు. గురువారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సూర్య నటించిన సింగం సిరీస్ కు ఈయనే కెమెరా వర్క్ చేశారు.

53 ఏళ్ల ప్రియన్ అసలు పేరు నాగేంద్రన్. తమిళనాడులోని విరుదునగర్ లో జన్మించారు. నటుడు, నిర్మాత కే బాలాజీ దగ్గర ఆయన కొన్నాళ్లు అసిస్టెంట్ గా పనిచేశారు. ఆపై దర్శకుడు బాలు మహేంద్ర చిత్రాలకు ఆయన పనిచేశారు.ముందారం పిరయి, సద్మా, యాత్ర చిత్రాలకు, మణిరత్నంతో కలిసి పగల్ నిలవు, నాయకన్ సినిమాలకు సహయకుడిగా వ్యవహరించారు. 1995లో కేఎస్ ఆధియమన్ దర్శకత్వం వహించిన తోట చినుంగి చిత్రంతో పూర్తి స్థాయి కెమెరామెన్ గా మారిపోయారు.

అక్కడి నుంచి తెనాలి(తెలుగులో తెనాలి), వల్లవన్(తెలుగులో వల్లభ), వేలాయుధం(తెలుగు ఆజాద్ రీమేక్), పూజై(తెలుగులో పూజా) చిత్రాలకు ఆయన కెమెరామెన్ గా వ్యవహరించారు. దర్శకుడు హరితో ఆయన ప్రత్యేక అనుబంధం ఉంది. విక్రమ్ సామి(తెలుగులో లక్ష్మీ నరసింహా) చిత్రం నుంచి మొదలైన వీరి కాంబో లో 13 చిత్రాలు వచ్చాయి. అందులో సింగం మూడు సిరీస్ చిత్రాలు కూడా ఉన్నాయి. దాదాపు హరి చిత్రాన్నింటికి ప్రియనే కెమెరా వర్క్ అందించారన్న మాట. ప్రస్తుతం సామి స్కేర్ కు కూడా ఆయనే డీవోపీ కావటం విశేషం. ఆయన మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకోగా.. ప్రముఖులంతా నివాళులర్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles