Not Yet Decided on Lakshmi's Veera Grandham | లక్ష్మీస్ వీరగ్రంథం ఇంకా డిసైడ్ కాలేదు.. టీడీపీలో మాత్రం చేరటం ఖాయం

Vani vishwanath about lakshmi s veera grandham

Vani Viswanath, Lakshmi's Veera Grandham Movie, Vani Viswanath TDP, Lakshmi's Veera Grandham Chandrababu Naidu, Lakshmi's Veera Grandham Director

Actress Vani Vishwanath about Lakshmi's Veera Grandham. She says not Decided yet. But, Confirms ready to join TDP.

లక్ష్మీస్ వీర గ్రంథంపై ఏ నిర్ణయం తీసుకోలేదు : వాణి విశ్వనాథ్

Posted: 11/07/2017 09:20 AM IST
Vani vishwanath about lakshmi s veera grandham

టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు హాట్ డిస్కషన్ కు తెరలేపిన విషయం తెలిసిందే. తమిళనాడు తెలుగు యువత అధ్యక్షుడు కేతినేని జగదీశ్వరరెడ్డి డైరెక్షన్ లో త్వరలో తెరకెక్కనున్న‘లక్ష్మీస్ వీరగ్రంథం’ గత కొన్నాళ్లుగా వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాకు ప్రముఖ నటి వాణీవిశ్వనాథ్ సహనిర్మాతగా వ్యవహరించటంతోపాటు నటించే అవకాశాలు ఉన్నాయని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.

కేతిరెడ్డి గారి లక్ష్మీస్ వీరగ్రంథంలో నటిస్తారా? అంటూ నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మా మేనేజర్ గారి ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆయనతో మాట్లాడమని చెప్పా. నిర్మాణంలో పాలు పంచుకోవటం గురించి వస్తున్న వార్తలు నిజం కాదు. అని ఆమె తెలియజేశారు. సోమవారం విజయవాడలో కనకదుర్గమ్మ వారిని ఆమె దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు.

ఇక రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబు మూడేళ్ల పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబుగారి నాయకత్వం అంటే నాకు చాలా ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పాను. అందుకే, టీడీపీలో చేరతానని చెప్పాను. అతి త్వరలోనే టీడీపీలో చేరతాను.చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసే అవకాశం వస్తే, వైసీపీ నేత రోజాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు. పార్టీలో చేరి ఎంత ఉత్తమంగా పని చేయగలుగుతానో అంత ఉత్తమంగా పని చేసేందుకు కృషి చేస్తా’ అని వాణీ విశ్వనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆమె నేడు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh