Kollywood Producers unhappy with 2.O Release Date Confusion | 2.ఓ పై అంతా గరం గరం

No clarity on 2 o release date

2.O Movie, 2.O Rajinikanth, Kollywood Producers, 2.O Official Release Date, 2.O Fresh Release Date, 2.O Visual Effects

2.O Release date not announced officially yet. Kollywood Producers fire on 2.O Makers due to lack of clarity. The Movie Supposed to Movie April due to Visual Effects.

2.ఓ రిలీజ్ డేట్ పై కోలీవుడ్ నిర్మాతల గరం

Posted: 11/06/2017 12:43 PM IST
No clarity on 2 o release date

దేశం మొత్తం ఇప్పుడు 2.ఓ చిత్ర విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇండియన్ స్పీల్ బర్గ్ గా పేరున్న శంకర్ డైరెక్షన్ కావటంతో ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు గ్రాఫిక్స్ హంగులు.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలకపాత్ర.. అన్నింటికి మించిన సూపర్ స్టార్ మార్క్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవటం ఖాయం.

అయితే ఎటొచ్చి ఈ చిత్ర విడుదల తేదీలోనే స్పష్టత లేకుండా పోయింది. ముందుగా ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని, జనవరి 25న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఆ తేదీ పక్కా అని ప్రకటించటంతో మిగతా కోలీవుడ్ నిర్మాతలు తమ చిత్రాలను ముందుకు జరుపుకున్నారు. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా గత కొన్ని రోజులుగా ఏప్రిల్ కు మారిందంటూ వార్త వినిపిస్తుండగా.. వాటిని చిత్ర నిర్మాతలు కూడా ఖండించకపోకపోవటంతో అదే నిజమై ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిగతా మేకర్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతోపాటు తమనూ కంగారు పెట్టకుండా స్పష్టమైన విడుదల తేదీ ప్రకటించాలని కోలీవుడ్ మీడియా ద్వారా వారు విజ్నప్తి చేస్తున్నారు. మరి గ్రాఫిక్స్ వర్క్ మూలంగా ఈ చిత్రం ఎప్పటికి వస్తుందో ఈ రెండు, మూడు రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles