Police Case against Rajasekhar’s Daughter Shivani | రాజశేఖర్ కూతురి యాక్సిడెంట్.. చివరకు పోలీస్ కేసు నమోదు

Rajasekhar daughter accident case

Rajasekhar, Shivani Rajasekhar, Jubilee Hills Police Station, Rajasekhar Daughter Accident Case, Rajasekhar Daughter Shivani, Rajasekhar Daughter Case

Rajasekhar’s Daughter Shivani Involved In Accident. Later Police Case filed in Jubilee Hills Police Station.

శివాని రాజశేఖర్ పై పోలీస్ కేసు నమోదు

Posted: 11/06/2017 09:22 AM IST
Rajasekhar daughter accident case

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానిపై కేసు నమోదు అయ్యింది. శనివారం రాత్రి ఆమె జూబ్లీహిల్స్ లో ఓ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ప్రమాదంలో అవతలి కారు చాలా వరకు పాడైంది కూడా.

శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవనిర్మాణనగర్‌ వైపు వెళ్తూ స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టారు. అయితే సెటిల్ మెంట్ కోసం యత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది కుదరకపోవటంతో ఘటనపై ఎస్‌పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్ల తెలుస్తోంది. దీంతో శివానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు. కాగా, త్వరలో ఆమె సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమౌతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles