Ram Charan's Ointment for SPYder Producer | మహేష్ బిగ్ డ్యామేజ్..చెర్రీ సాయం

Ram charan promise to spyder makers

Ram Charan, NV Prasad, NV Prasad Banner,Rangasthalam Movie, SPYder Producers, Ram Charan New Movies, Ram Charan Upcoming Movies, Mahesh Babu Damagae Ram Charan,

Mega Power Star Ram Charan Commits new movie with NV Prasad Banner. After SPYder debacle Cherry promise to Prasad to make a movie under his banner.

స్పైడర్ బ్యానర్ లో రామ్ చరణ్ సినిమా

Posted: 11/02/2017 06:50 PM IST
Ram charan promise to spyder makers

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ తో దారుణంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సైకో థ్రిల్లర్ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. వంద కోట్ల పై బడ్జెట్ తో తెరకెక్కి, 120 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం నిర్మాత ఎన్వీ ప్రసాద్ కు దారుణ నష్టాలనే అందించింది.

ఇప్పుడు ఆ నష్టం నుంచి బయటపడాలంటే ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేయవలసి ఉంటుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. చరణ్ వరుస పరాజయాలతో ఉన్న సమయంలో 'ధ్రువ' సినిమా ద్వారా హిట్ అందుకున్నారు. ఆ సినిమాకు అల్లు అరవింద్ తోపాటు ఎన్వీ ప్రసాదే సహ నిర్మాతగా వ్యవహరించారు. దీంతో తనకి సక్సెస్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకున్న చెర్రీ, ఎన్వీ ప్రసాద్ బ్యానర్లో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని తెలుస్తోంది.

రంగస్థలం తరువాత కొరటాల దర్శకత్వంలో చరణ్ సినిమా ఉండనుంది. బహుశా ఆ తరువాత సినిమా ఎన్వీ ప్రసాద్ బ్యానర్లో ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ మధ్యలో ఆయన మీడియం బడ్జెట్ సినిమా ఒకటి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles