Vijay's Mersal attains the 200 crore milestone | మెర్సల్ రికార్డుల పర్వం.. 12 రోజుల్లో 200 కోట్లు.. కబాలి తర్వాతి ప్లేస్ లో?

Mersal 12 days collections

Vijay Mersal, ersal Collections, Vijay Mersal Movie, Mersal Collections, Vijay Mersal 200 Crores Club, Vijay Mersal News, Mersal Total Collections, Mersal Kabali, Mersal Malaysia France, Mersal Records

Vijay's Mersal Movie Collected 200 crore Club. Mersal box office collection report: Thalapathy Vijay's film has set unbelievable records in France and Malaysia.

మెర్సల్ డబుల్ సెంచరీ కలెక్షన్లు

Posted: 11/02/2017 06:17 PM IST
Mersal 12 days collections

కోలీవుడ్ లో దీపావళితో మొదలైన 'మెర్సల్' పండగ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు నుంచే భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. కేవలం ఓవర్సీస్ లో(12 రోజుల్లో) ఈ సినిమా 72 కోట్లు వసూలు చేయడం విశేషం.

ముఖ్యంగా ఫ్రాన్స్ , మలేసియాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఫ్రాన్స్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో మొదటిస్థానంలో 'కబాలి' .. రెండవ స్థానంలో 'బాహుబలి' ఉండగా, మూడవస్థానంలో 'మెర్సల్' నిలిచింది. ఫ్రాన్స్ లో 10కే క్లబ్ లో చేరిన ఈ సినిమా, మలేసియాలో 17 కోట్లు రాబట్టింది. అక్కడ అత్యధిక వసూళ్లను సాధించిన మొదటి తమిళ చిత్రంగా 'కబాలి' ఉండగా .. రెండవ తమిళ చిత్రంగా 'మెర్సల్' నిలిచింది.

ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా 139.52 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 211.44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ రివెంజ్ డ్రామాకి ముగ్గురు విజయ్ ల యాక్టింగ్ ఆకర్షణగా నిలవటంతో మెర్సల్ వసూళ్లకు అడ్డుకట్టపడటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mersal  Vijay  మెర్సల్  విజయ్  

Other Articles