Legendary Director Confirms Balayya's Son for Sequel | ఆదిత్య 369 సీక్వెల్ బాలయ్య ‘కీ’ రోల్ మాత్రమేనంట.. మరి హీరో??

Adithya 369 sequel again in news

Singeetam Srinivasa Rao, Adithya 369 Sequel, Adithya 369 Sequel Mokshagna, Nandamuri Mokshagna, Balayya Key Role Mokshagna Lead, Mokshagna Debut, Balayya Adithya 369 Sequel, Singeetam Balayya Mokshagna

Singeetam Srinivasa Rao Confirms Balakrishna's Son Mokshagna for Adithya 369 Sequel. Mokshagna in Lead If Balayya accepted.

మోక్షజ్నతో ఆదిత్య 369 సీక్వెల్ : సింగీతం

Posted: 10/25/2017 01:05 PM IST
Adithya 369 sequel again in news

దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు పేరు వినగానే ఆయన తెరకెక్కించిన ఆణిముత్యాల వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ప్రయోగాత్మక చిత్రాలను సైతం తెరకెక్కించి విజయాలను అందుకున్న ప్రత్యేకత ఆయన సొంతం. అలాంటి సింగీతం శ్రీనివాస్ రావు .. గతంలో బాలకృష్ణకి 'ఆదిత్య 369' .. 'భైరవ ద్వీపం' వంటి హిట్స్ ఇచ్చారు.

'ఆదిత్య 369' కంటెంట్ గురించి .. అప్పట్లో ఆ సినిమా సాధించిన సంచలన విజయం గురించి అభిమానులకు తెలుసు. అందువలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే వాళ్లకి అంతకిమించిన ఆనందం ఉండదు. అయితే ఎప్పటి నుంచో వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'ఆదిత్య 369' సీక్వెల్ చేయాలని ఫ్లాన్ వేసుకుంటున్నారు. ఈ సీక్వెల్ కి స్క్రిప్ట్ కూడా రెడీ గా వుంది. అయితే బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

దీంతో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఇప్పుడు మరోసారి ఆ అంశంపై స్పందించారు.ఈ సీక్వెల్ లో బాలకృష్ణ తనయుడు 'మోక్షజ్ఞ' హీరో పాత్రను పోషిస్తాడు. బాలకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. బాలకృష్ణ ఓకే అంటే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది" అని ఆయన అన్నారు. మరి బాలయ్య దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles