Tiger Zinda Hai First look Release | టైగర్ జిందా హై ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కు ఏం ఇవ్వాలో భాయ్ కు బాగా తెలుసు

Salman new movie firstlook

Tiger Zinda Hai, Tiger Zinda Hai New Poster, Tiger Zinda Hai First look, Tiger Zinda Hai Action Poster, Tiger Zinda Hai Salman and Katrina, Salman and Katrina Action Mode, Tiger Zinda Hai First look Review, Tiger Zinda Hai Director Ali Abbas Zaffar

Tiger Zinda Hai First look poster Release. Salman Khan, Katrina Kaif and way too much action. The Movie release on December 22nd.

టైగర్ జిందా హై ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 10/25/2017 12:37 PM IST
Salman new movie firstlook

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు తన అభిమానులకు ఎలాంటి ట్రీట్ అందించాలో బాగా తెలుసు. అందుకే తన చిత్రాల్లో మాస్ మసాలా కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంటాడు. అందుకే తన రాబోయే చిత్రం టైగర్ జిందా హై లో కూడా అదే పని చేయబోతున్నాడు.

కబీర్ ఖాన్ డైరెక్షన్ లో రూపొందిన ఏక్తా టైగర్ సీక్వెల్ టైగర్ జిందా హై ఫస్ట్ లుక్ పోస్టర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. అయితే దీనికి మాత్రం అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో సుల్తాన్ వంటి భారీ హిట్ వచ్చింది. దీంతో ఈ సారి కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్ బ్యానర్ లోనే ఈ గూఢఛారి సినిమా సీక్వెల్ వస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో భారీ యాక్షన్ కాన్సెప్ట్ చూపించారు. సల్లూ భాయ్ తో పోటీ పడి మరీ.. కేట్ యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగినట్లు స్పష్టమౌతోంది. మొదటి పార్ట్ లో సల్మాన్ రా ఏజెంటుగా.. కత్రినా ఐఎస్ ఐ(పాకిస్తాన్) ఏజెంటుగా కనిపించారు. మరి ఈ కొత్త సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే. రీమేక్ లు మాసేసి కొత్త కథలను ఎంచుకుంటున్న సల్మాన్.. ట్యూబ్ లైట్ తో దారుణంగా నిరాశపరిచాడు. మరి ఈ గుఢాచారి సీక్వెల్ తో గట్టి హిట్ కొడతాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger Zinda Hai  Salman Khan  Katrina Kaif  

Other Articles