Young Directors also Part in Mahanati Movie | మహానటి కోసం భారీ హంగులు.. ఎవరెవరు ఉన్నారంటే...

Mahanati new updates

Mahanati Movie, Krish and Tarun Bhaskar Mahanati, Mahanati Roles, Mohan Babu as SV Ranga Rao, Prakash rao as Chakrapani

Tollywood Directors also part of Mahanati Movie, Krish and tarun Bhaskar also acted in this movie. Mohan Babu as SV Ranga Rao. Prakash Raj as Cakrapani.

మహానటిలో టాప్ దర్శకులు కూడా...

Posted: 10/21/2017 05:40 PM IST
Mahanati new updates

సావిత్రి జీవితచరిత్రగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.

సావిత్రి కెరీర్ లో మయాబజార్ చాలా కీలకమైన సినిమా అన్నది తెలిసిందే. అందులో వివాహ భోజనంబు సాంగ్ ఓ ట్రెండ్ సెట్టర్. ఎస్వీఆర్ ఆ పాటలో అద్భుతంగా అభినయించగా.. ఆ పాటను కూడా మహానటిలో పెట్టేందుకు సిద్ధమైపోతున్నాడు దర్శకుడు నాగ అశ్విన్. అల్రెడీ ఆ పాటను కూడా మోహన్ బాబుపై చిత్రీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ .. ఈ సినిమాకి అసిస్టెంట్ దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించనున్నారనేది తాజా సమాచారం. మొత్తానికి 'మహానటి' సినిమా నటీనటుల ఎంపికతోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .. ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ భారీ హంగులు చిత్రాన్ని ఏమేర నిలబెడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles