Singer Pranavi about Casting Couch | వేధింపుల గురించి వార్నింగ్ ఇచ్చిన సింగర్

Singer pranavi interview

Singer Pranavi, Pranavi Casting Couch, Singer Pranavi Idreams Interview, Pranavi Warn Director, Singer Pranavi and Dance Master Raghu

Singer Pranavi about Casting Couch. She warned a director her Intial stage.

వేధింపుల గురించి సింగర్ ప్రణవి

Posted: 10/17/2017 03:40 PM IST
Singer pranavi interview

కాస్టింగ్‌ కౌచ్‌.. ఈ మధ్య ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో వినిపిస్తున్న పదం. అవకాశాల కోసం వచ్చే వారిని శారీరకంగా వాడుకోనిస్తే ఛాన్సులు ఇస్తామని ఆశపెట్టడమే దీని ఉద్దేశం. అయితే ఇంత కాలం నటించేవారికి మాత్రమే ఆ సమస్య అని అనకుంటుండగా.. టాలీవుడ్ యంగ్ సింగర్ ఒకరు ఆ సమస్య అందరికీ ఉందని చెబుతున్నారు.

యంగ్ సింగర్స్ జాబితాలో 'ప్రణవి' పేరు కూడా వినిపిస్తుంది. ప్రణవి వాయిస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే శ్రోతలను మంత్ర ముగ్ధులను చేస్తుంది. అందువల్లనే ప్రణవిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తుంటాయి. అలాంటి ప్రణవి డాన్స్ మాస్టర్ రఘుతో వివాహంతో ఒక్కటయ్యింది. ఇక కెరియర్ పరంగా తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఓ యూట్యూబ్ ఛానెల్ తో ఆమె పంచుకుంది. తాను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ సినిమాకి పాట పాడటానికి వెళ్లాననీ, ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడు తనతో అసభ్యంగా మాట్లాడాడని అంది. సినిమాల్లో పాటలు పాడాలనుకుంటే తనతో ఉండాలంటూ ఆయన కోరాడని చెప్పింది.

అయితే తాను చెప్పుతీసుకుని కొడతానని హెచ్చరించిందంట. అలా వచ్చే అవకాశాలు తనకి అవసరమే లేదని.. పైగా వయసుతో సంబంధం లేకుండా అతగాడు చేసిన వ్యాఖ్యలపై దుమ్ము దులిపి వెళ్లిపోయిందంట. తననే కాదు తన ఎదురుగా ఆడపిల్లలను ఎవరైనా ఏమైనా అంటే తాను చూస్తూ ఊరుకోననీ .. ధైర్యంగా వెళ్లి వాళ్లను కొట్టేస్తానని చెప్పింది. అందువల్లనే సాధారణంగా తన జోలికి ఎవరూ రారని చెప్పుకొచ్చిందామె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles