Vijay Meets and Thanked Tamil Nadu CM Palaniswami | విజయ్ సీఎం పళనిని కలిశాడు.. తెలుగులో పోటీ తప్పదా?

Line clear for vijay mersal movie

Tamil Nadu, Entertainment Tax, Actor Vishal, Mersal Movie, CM Palaniswami, Vijay Meets Palani Swami, Vishal Theater Owners, Vishal Palaniswami, online and parking Charges in Tamil Nadu

Tamil Nadu Government cuts entertainment tax on Tamil films to 8% from 10%. Line Clear for Vijay's Mersal Movie. Vijay meet CM Palaniswami and Thanked him. Vishal warned theater owners Don't charge for booking tickets online, parking.

విజయ్ సినిమాకు తొలగిన అడ్డంకులు

Posted: 10/16/2017 09:02 AM IST
Line clear for vijay mersal movie

కోలీవుడ్ లో వినోద పన్ను వివాదం ఎట్టకేలకు సమసింది. టాక్స్ ను 10 నుంచి 8 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు రావటంతో సమ్మె విరమణకు కోలీవుడ్ పరిశ్రమ సుముఖత వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా షూటింగ్ లు చేయకుండా.. కొత్త సినిమాలు రిలీజ్ కానీయకుండా నడిగర్ సంఘమే అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలు దఫాలు ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు జరిపిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 18న విజయ్ అదిరింది చిత్రం రిలీజ్ కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మె కారణంగా ఇళయదళపతి అభిమానుల్లో సినిమా విడుదలపై టెన్షన్ నెలకొంది. అయితే తాజా వార్తతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయినట్లు స్పష్టం అవుతుంది.

సీఎంను కలిసిన విజయ్...

ఇక తమిళనాడు సీఎం పళనిస్వామిని స్టార్ హీరో విజయ్ కలిశాడు. చెన్నైలోని పళనిస్వామి నివాసానికి వెళ్లిన విజయ్ కృతజ్నతలు తెలియజేశాడు. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్ పీసీ), సినీ సంఘాల వినతి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

విజయ్ త్రిపాత్రాభినయం చేసిన ‘మెర్సల్’ తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ కాబోతుంది. కాజల్, సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లు. కాగా, అదే రోజు రవితేజ నటించిన రాజా ది గ్రేట్ విడుదల అవుతుండటంతో విజయ్ సినిమాకు తెలుగులో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Vijay  Vishal  తమిళనాడు  విజయ్  విశాల్  

Other Articles