Failures are Common for All Top Heroes | హిట్ హీరోలంటూ ఉండరు బాస్

Heroes failure journey

Top Heroes, All Indian Languages Movies, Disaster Movies, Mahesh Babu Failure Star, Hit Heroes Flop Heroes

Top Stars Across in All Industries Suffer with Failures. From Tollywood Mahesh Babu, Kollywood Suriya and Ranbir Kapoor from Bollywood Best Example for this.

హిట్ హీరోలంటూ ఉండరు బాస్

Posted: 10/06/2017 06:14 PM IST
Heroes failure journey

హిట్-ఫ్లాపు ఇది ఏ హీరోకైనా సాధ్యమే. అయితే ఈ మధ్య స్టార్ హీరోలతో సహా క్రేజ్ ఉన్న హీరోలంతా అంచనాలకు తగ్గట్లు అభిమానులను అలరించలేకపోతున్నారు. ఉదాహరణకు.. మహేష్ బాబు స్పైడర్ చిత్రాన్నే తీసుకోండి. తమిళ్ లో హిట్ టాక్ కైవసం చేసుకున్న ఈ చిత్రం.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అనే డిసైడ్ అయిపోయింది.

అంతవరకు బాగానే ఉన్న బ్రహ్మోత్సవం తర్వాత స్పైడర్ కూడా ఫ్లాపు కావటంతో మహేష్ రాంగ్ ఛాయిస్ లపై విమర్శలు మొదలయ్యాయి. కొందరైతే ఏకంగా టాప్ చైర్ కు సూపర్ స్టార్ దూరం అయిపోయాడంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అసలు ఫ్లాపు లేని హీరో ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్న లేవనెత్తవాళ్లు లేకపోలేదు. పొకిరీకి ముందు మహేష్ బాబు కెరీర్ ఎలా సాగిందో తెలిసిందే. మధ్యలో ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి అలరించాడు కూడా. ఆ తర్వాత యాక్టింగ్ పరంగా నిజంతో క్రిటిక్స్ ను మెప్పించాడు. కానీ, కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఫోకిరి తర్వాత మూడు హ్యాట్రిక్ డిజాస్టర్లు చవి చూశాడు. ఆపై దూకుడుతో మరోసారి వండర్ క్రియేట్ చేసి వరుస హిట్లు అందించాడు. మళ్లీ మధ్యలో వన్ సినిమా ఫ్లాప్. చివరకు.. శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక ఇప్పుడు వరుసగా రెండు డిజాస్టర్లు అందించాడు. ఆ మాత్రానికే డిజాస్టర్ స్టార్ అంటూ ట్యాగ్ టైన్ తగిలేస్తున్నారు కొందరు.

గతంలో చాలా హీరోలు కూడా ఇలా ఫ్లాపులతో సతమతం అయినవారే. మరో అగ్ర హీరో పవన్ కళ్యాణ్ ఖుషీ తర్వాత మరో హిట్ అందుకోవటానికి దాదాపు దశాబ్దంపైగానే ఎదురు చూశాడు. ఇక ఇప్పుడు గత రెండు చిత్రాలతో నిరాశపరిచాడు కూడా. ఇక్కడ పవన్-మహేష్ ల మధ్య ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా కంపేరిజన్ రావొచ్చు. కానీ, మహేష్ స్టామినాను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదన్నది గుర్తించాలి. నితిన్ కెరీర్ కూడా అంతే. యమ దొంగ - టెంపర్ మధ్య తారక్ కెరీర్ కూడా ఎలా సాగిందో చూశాం. ఈ లిస్ట్ లో చిన్న చితకా హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్లాపు ఇచ్చిన వారు తర్వాత హిట్ కొడతారాన్న గ్యారెంట ీ లేదు. అలాగే హిట్ ఇచ్చిన వారు.. ఫ్లాపు ఇవ్వరన్న నమ్మకం లేదు.

ఈ ఫ్లాపు ట్రాక్ సమస్య ఒక్క తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోని హీరోలకు కూడా ఉంది. ఒకానోక టైంలో ఖాన్ త్రయంతో పోటీగా రెమ్యునరేషన్ అందుకున్న రణ్ బీర్ పరిస్థితి చూస్తున్నాం. అతను వరుస ఫ్లాపుతో సతమత మవుతున్నాడు. కోలీవుడ్ హీరో సూర్య పరిస్థితి కూడా అంతే. సింగం పార్ట్ 1 తర్వాత మరేయితర చిత్రం కూడా సూర్యకు సక్సెస్ ఇవ్వలేకపోయింది. అంటే దాదాపు ఆరేళ్ల నుంచి సూర్యకి హిట్ కరువైందన్న మాట. అలాంటప్పుడు హీరోలను.. వారి స్టామినాను చులకన చేస్తూ కామెంట్లు చేయటం సరికాదన్న వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles