Dark Comedy Director Kundan Shah Passes Away / డార్క్ కామెడీ డైరెక్టర్ గుండె పోటుతో మృతి

Bollywood director kundan shah died

Bollywood, Senior Director, Kundan Shah, Jaane Bhi Do Yaaro Movie, Dark Comedy, Kabhi Haan Kabhi Naa Movie

Bollywood Veteran director Kundan Shah, best known for the dark comedy "Jaane Bhi Do Yaaro", died at his home early with Heart Attack, family sources said. He was 69. He had studied direction at the Film and Television Institute of India in Pune and made his feature film debut in 1983 with the cult classic "Jaane Bhi Do Yaaro" (1983). The director made his Bollywood comeback in 1993 with Shah Rukh Khan-starrer "Kabhi Haan Kabhi Naa".

దిగ్గజ దర్శకుడు కుందన్ షా కన్నుమూత

Posted: 10/07/2017 03:23 PM IST
Bollywood director kundan shah died

బాలీవుడ్ దిగ్గజం, నాన్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు కుందన్ షా ఇక లేరు. 70 ఏళ్ల కుందన్ గత రాత్రి గుండెపోటుతో ముంబైలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆ టైమ్ లోనే డార్క్ కామెడీ మూవీస్ తో ఫేమస్ అయిన షా పలు అవార్డులను సైతం సొంత చేసుకున్నారు.

1947 అక్టోబర్ లో జన్మించిన షా పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్యార్థిగా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత సహ రచయితగా మారిన ఆయన.. చివరకు 1983 లో జానే బీ దో యారో సినిమా ద్వారా దర్శకుడిగా మారిపోయాడు. ఆ సినిమాకు రచన కూడా ఆయనే. సినిమా పెద్ద హిట్ కాకపోయినా లీడ్ ఫెర్ ఫార్మెన్స్ లతో క్లాసిక్ గా మాత్రం నిలిచిపోయింది. సినిమాల‌తో పాటు `నుక్క‌ద్‌`, `వ‌గ్లే కి దునియా` వంటి టీవీ సీరియ‌ళ్ల‌కు కుంద‌న్ షా దర్శ‌క‌త్వం వ‌హించారు.

పదేళ్ల తర్వాత తిరిగి మెగా ఫోన్ పట్టి షారూఖ్ ఖాన్ హీరోగా కబీ హాన్ కబీ నా చిత్రానికి ఆయన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే సినిమా హిట్ కాకపోయినా అవార్డుల పంక్షన్ లలో మాత్రం అదరగొట్టింది. ఆ చిత్రానికి గానూ షారూక్ కు బెస్ట్ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు(క్రిటిక్స్ విభాగంలో) దక్కింది. ఆ చిత్రాన్నే జగపతి బాబు హీరోగా స్వప్నలోకం పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తీసిన క్యా కహేనా మాత్రం హిట్ గా నిలిచింది. ప్రీతి జింటా డెబ్యూ మూవీ అదే కావటం విశేషం. షా చివ‌రి సినిమా `పీ సే పీఎం త‌క్‌`, ఈ చిత్రం 2014లో విడుద‌లైంది. సెటైరిక‌ల్ కామెడీకి మారుపేరుగా ఆయ‌న చిత్రాలు నిలిచాయి. ఆయ‌న మృతిపై ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles