Renu Desai Doesn't wants to marry again | పవన్ ఫ్యాన్స్ ’రెండో పెళ్లి కామెంట్ల‘పై రేణూ రియాక్షన్

Renu desai on second marriage

Renu Desai, Pawan Kalyan, Ex Wife, Pawan Ex Wife, Renu Desai Second Marriage

Renu Desai Does Not wants to marry again. Even after separating from Pawan Kalyan, Renu Desai has been maintaining good friendship and cordial relations with her ex-husband.

రెండో పెళ్లి కామెంట్లపై రేణూ దేశాయ్ రిప్లై

Posted: 10/04/2017 09:15 AM IST
Renu desai on second marriage

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ ఈ మధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు చెప్పింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఆమె వ్య‌క్తిగ‌త విష‌యంపై కామెంట్లు చేయటం ప్రారంభించారు.

మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ... మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు.. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం త‌గ్గిపోతుంది.. ప‌వ‌న్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వ‌దిన అంటాం.. మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధప‌డే అవ‌కాశం ఉంది’ అంటూ ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి అభిమానులు ఉచిత స‌ల‌హాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అది ఆటోమేటిక్ గా రేణూ దేశాయ్‌కి కోపం తెప్పింది. ఈ కామెంట్లు కేవలం త‌న‌ను ఉద్దేశించిన‌వేన‌ని తాను అనుకోవడం లేదని పేర్కొంటూ ఫేస్ బుక్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ ఉంచింది. అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామ‌ని ప్రశ్నిస్తూ ఆమె మండిపడింది. 'ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?' అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఒక వైపు మహిళల‌ సమానత, సాధికార‌త, అత్యాచారాల నుంచి మహిళలకు రక్షణ వంటి అంశాల‌పై ప్ర‌సంగాలు చేస్తూనే.. మ‌గ‌వారు మ‌రోవైపు ఇలాంటి కామెంట్లు చేస్తున్నార‌ని చెప్పింది.

తాను ఏడేళ్లు ఒంటరిగా ఉండి, ఇప్పుడు త‌న‌కు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండునని అనిపించిందని చెప్పాన‌ని తెలిపింది. ఒక అమ్మాయి మ‌రో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా? అని ఆవేద‌న వ్యక్తం చేసింది. తాను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అని ప్ర‌శ్నించింది. అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలు వారి కుమారుల‌ను పద్ధతిగా పెంచాలని తాను ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌ని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles