Mahanubhavudu First Weekend Collections | మహానుభావుడు ఫస్ట్ వీక్ వసూళ్లు.. లవ కుశ, స్పైడర్ లతో కంపేర్ చేస్తే...

Mahanubhavudu weekend collections

Mahanubhavudu Movie, Sharwanand, First Weekend Collections, Mahanubhavudu Jai Lava Kusa Spyder Movie Collections

Mahanubhavudu Movie First Week Collections. Sharwanand Movie Collects 10 Crores Above.

మహానుభావుడు వీకెండ్ కలెక్షన్లు

Posted: 10/03/2017 05:42 PM IST
Mahanubhavudu weekend collections

ఓవైపు టాలీవుడ్ లో ఇద్దరు బిగ్ స్టార్ల బరిలోకి దిగారు. జై లవ కుశతో ఎన్టీఆర్, స్పైడర్ తో మహేష్ బాబు థియేటర్స్ లో ఉండగా శర్వానంద్ మహానుభావుడిగా రంగంలోకి దిగాడు. దాంతో అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, కంటెంట్ లో కాన్ఫిండెంట్ తో అలా చేస్తున్నారని అంతా అనుకున్నారు. అయితే వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

తొలిరోజు పాజిటివ్ సంపాదించుకున్న చిత్రం పండగ వీకెంట్ లో మంచి వసూళ్లను రాబట్టింది. థియేటర్ల కొరత సమస్య ఎదురైనా తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 10 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా 7.85 కోట్ల షేర్ ను కొల్లగొట్టగా, మిగతా ప్రాంతాలన్నీ కలుపుకుని మొత్తం 10 కోట్ల 30 లక్షల షేర్ ను సాధించింది.

'జై లవ కుశ' మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాగా, 'స్పైడర్' క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చింది. ఇక యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రావడం 'మహానుభావుడు' సినిమాకి బాగా కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles