Kerala HC grants Dileep bail in actress abduction case | నటి లైంగిక వేధింపుల కేసు.. 85 రోజుల తర్వాత ఊరట

Kerala hc grants bail to actor dileep in actress abduction case

dileep, dileep granted bail, kerala high court, kerala court grants dileep bail, kavya madhavan, actress bhavana, kerala news, human interest, Dileep bail, latest news

Kerala High Court on Tuesday granted conditional bail to actor Dileep accused of plotting to abduct and assault a Malayalam actress after 86 days.

నటి అపహరణ కేసులో నటుడికి తాత్కాలిక ఊరట..

Posted: 10/03/2017 02:21 PM IST
Kerala hc grants bail to actor dileep in actress abduction case

ప్రముఖ మలయాళ నటి అపహరణ, అత్యాచారం కేసులలో కీలక సూత్రధారిగా అభియోగాలను ఎదుర్కోంటున్న మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కు తాత్కాలిక ఊరట లభించింది. నాలుగు పర్యాయాలు ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు ఇవాళ ఆయన బెయిల్ పిటీషన్ పై సానుకూలంగా స్పందించింది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ థామస్ ఇవాళ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను  మంజూరుచేశారు. దీంతో 86 రోజుల తర్వాత నటుడి దిలీప్ కు తాత్కాలిక ఊరట లభించింది.

తన మొదటి భార్యకు తన వ్యక్తిగత విషయాలను చెప్పడంతో పాటు తమ దాంపత్య జీవితంలో అమె అగ్గిరాజేసి చివరకు విడాకులు తీసుకునేంత వరకు వెళ్లిన నేపథ్యంలో నటిపై కక్ష పెంచుకున్న నటుడు దిలీప్.. గత ఫిబ్రవరిలో అమెను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కోంటున్నాడు. ఈ కేసులో జూలై 10న  దిలీప్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పక్కాగా ఆధారాలు  సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన దిగువ కోర్టు మొదలుకుని కేరళ హైకోర్టు వరకు పలుమార్లు తన బెయిల్ ఇవ్వాల్సిందిగా అర్ధిస్తూ పెట్టుకున్న పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఎట్టకేలకు ఇవాళ ఆయన షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దిలీస్ తన పాస్ పోర్టును న్యాయస్థానంలో అప్పగించాలని అదేశించిన న్యాయస్థానం.. రూ. లక్ష చోప్పున ఇద్దరు షూరిటీలను కూడా పోందుపర్చాలని అదేశించింది. అయితే ఈ క్రమంలో సాక్షులను ప్రభావితం చేసినట్లు, అధారాలను చెడగొట్టేందుకు యత్నించిన పక్షంలో బెయిల్ రద్దు అవుతుందని కూడా సూచించింది. విచారణ అధికారులు పిలిచనప్పుడు వారి ఎదుట హాజరవ్వాలని కూడా న్యాయస్థానం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dileep  bail  kerala high court  kavya madhavan  actress bhavana  kerala  latest news  

Other Articles