Karthi Khakee Official Teaser Released and Review | కొత్త టీజర్.. ఇసుకలోంచి పైకి లేచిన ’ఖాకీ‘

Karthi new movie teaser out

Karthi, Khakee Movie, Teaser, Khakee Teaser, Theeran Adhigaram Ondru Aka Khakhee, Karthi New Teaser

The teaser of Karthi's upcoming film Khakee(Theeran Adhigaram Ondru) has dropped and it promises the film to be a solid cop thriller. Karthi and Rakul Preet Singh have teamed up together for the first time for this flick.

కార్తీ ఖాకీ టీజర్ వచ్చేసింది

Posted: 09/28/2017 07:32 AM IST
Karthi new movie teaser out

కోలీవుడ్ కమ్ టాలీవుడ్ హీరో కార్తీ నటించిన ద్విభాషా చిత్రం ‘ఖాకి’ టీజర్ రిలీజ్ అయ్యింది. జస్ట్ విజువల్ గా సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేశారు నిర్మాతలు. వంద కోట్ల జనాభా ఉన్న దేశంలో నాలుగు వేలి ముద్రల్ని పట్టుకుని కేసును ఎలా ఛేదిస్తావ్ అంటూ ఓ అధికారి హీరోను ప్రశ్నిస్తున్నట్లు వాయిస్ ఓవర్ ఉంటుంది.

ఓ వైపు వాయిస్ వస్తుంటే మరోవైపు ఎడారి ప్రాంతంలో అట్రాక్టివ్ విజువల్స్ తో ఆకట్టకునే ప్రయత్నం చేస్తారు. చివర్లో ఎడారిలో ఇసుకలో పూడుకుపోయి ఉన్న కార్తి.. పైకి లేచే సీన్ సూపర్బ్ గా ఉంది. ఇది వరకు రిలీజ్ చేసిన కార్తీ పోలీస్ లుక్కు కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెబుతున్నారు. పవర్ ఆఫ్ పోలీస్ అన్న కాఫ్షన్ తో ఇదొక సిన్సియర్ ఆఫీసర్ స్టోరీ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా.. సుభాష్ గుప్తా ఈ సినిమాతో నిర్మాతలుగా మారుతుండటం విశేషం.

తమిళంలో ‘శతురంగ వేట్టై’ తీసిన వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ‘ఖాకి’ ట్రైలర్ అక్టోబరు 17న రానుండగా.. సినిమాను నవంబరు 17న విడుదలవుతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh