ఎరోటిక్ సినిమా వెనుక ఎమోషనల్ ట్రాజడీ కథ | Vijayendra Prasad Says Srivalli Story Born from Emotionals .

Vijayendra prasad about srivalli movie

Vijayendra Prasad, Vijayendra Prasad Srivalli Movie, Srivalli Movie Story, Srivalli Movie Story, Srivalli Movie Tragedy, Vijayendra Prasad Erotic Movie

Vijayendra Prasad Interview for Srivalli Movie Promotions. Shared Emotional Feelings behind

విజయేంద్ర ప్రసాద్ శ్రీవల్లి కథ ఎలా పుట్టిందంటే...

Posted: 09/12/2017 06:40 PM IST
Vijayendra prasad about srivalli movie

సీనియర్ రైటర్, బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విజయేంద్ర ప్రసాద్ మరోసారి సొంత కథతో సినిమా తీశారు. గతంలో చంద్రహాస్, రాజన్న చిత్రాలను తీసిన ఆయన తన సొంత కథను సిద్ధం చేసుకుని .. దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే శ్రీవల్లి. కాస్త బోల్డ్ కంటెంట్ చిత్రంగా కనిపిస్తున్న ఈ చిత్రంలో న్యూడ్ సీన్లు కూడా ఉన్నాయని మొన్నీమధ్యే ఆయన స్టేజీ మీద కామెంట్ చేయటం కూడా చూశాం.

అయితే అది కేవలం మహిళా టెక్నిషియల సమక్షంలోనే తెరకెక్కించామని క్లారిటీ కూడా ఇచ్చారు లేండి. చిత్ర ప్రమోషన్ లలో పాల్గొంటున్న ఆయన.. మనసు .. ఆలోచనలకి సంబంధించిన మానసిక విశ్లేషణగా శ్రీవల్లి కథ అని చెప్పారు. ఇంతకీ ఈ కథ ఎలా పుట్టిందో కూడా ఆయన చెప్పుకొచ్చారు. వైజాగ్ లో ఆయనకు రమేశ్ అనే మిత్రుడు ఉండేవాడంట. 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. మనసు ఆయన వైపే లాగిందని చెప్పారు. అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్ లో ఆయన ఇంటికి వెళ్లానని అన్నారు.

 

అయితే తన మిత్రుడు 2010లో వినాయక చవితి ముందు రోజు చనిపోయాడనీ, చివరి క్షణాల్లో తనని ఎంతగానో తలచుకున్నాడని ఆ కుటుంబ సభ్యులు చెప్పారని అన్నారు. తనని తన మిత్రుడు తలచుకున్నప్పుడే .. తన మనసు ఆయన వైపుకు ఎందుకు లాగింది? అనే ఆలోచనలో నుంచి .. ఆ బాధలో నుంచి ఈ కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రజత్, నేహాహింగే జంటగా నటించిన సైంటిఫిక్ అండ్ ఎరోటిక్ థ్రిల్లర్ 'శ్రీవల్లి' ఈ నెల 15వ విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles