కోట్లు కొల్ల‌గొడుతున్న దెయ్యం సినిమా.. | IT Movie Hits Collections In India.

It movie in indian screens

IT Movie, Horror Movie, IT After Jungle Book, IT Movie Indian Collections, IT Movie Story

IT Horror Movie box office collections in India. Sensation After Jungle Book in Indian Screen.

ఇండియన్ స్క్రీన్ పై ఇట్ సెన్సేషన్

Posted: 09/12/2017 06:57 PM IST
It movie in indian screens

హాలీవుడ్ చిత్రాలు ఇండియన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయటం కొత్తేం కాదు. జంగిల్ బుక్ సుమారు 150 కోట్లు వసూలు చేసి మన చిత్రాలకే పెద్ద సవాల్ విసిరింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయి చిత్రాలేవీ ఇక్కడ రిలీజ్ కాలేదు. కానీ, ఇప్పుడు ఓ మోస్తరు చిత్రంతో ఓ హర్రర్ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది.

ప్ర‌ముఖ ఆంగ్ల ర‌చ‌యిత స్టీఫెన్ కింగ్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిన `ఇట్‌` సినిమా భార‌త‌దేశ మార్కెట్‌లో కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేస్తోంది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రూ. 11 కోట్ల‌కి పైగా వ‌సూలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

దీనిపై వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ పిక్చ‌ర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ డెంజిల్ డ‌యాస్ ఆనందం వ్య‌క్తం చేశారు. దీనికి ఆండీ మూషెట్ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డుల‌ను కొల్లగొడుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 117.2 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్కువ మొత్తంలో ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు సాధించిన మొద‌టి హార్ర‌ర్ చిత్రంగా `ఇట్‌` నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles