పవన్ సినిమా కథ ఆ థీమ్ తోనేనా? | Father Sentiment Highlight in PK 25th Movie.

Pawan 25th movie theme out

Pawan kalyan, Agnatavasi Movie, father Sentiment, Pawan kalyan New Movie, PK Trivikram Movie, Pawan Agnatavasi Story Line, pawan kalyan New Movie Title

Pawan Kalyan Trivikram Movie Base on Father Sentiment Theme. Presently Makers Shoot Songs on Pawan And Keerthy Suresh. Agnatavasi title consider for it.

పవన్ 25వ చిత్రం స్టోరీ ఆ కాన్సెప్టేనా?

Posted: 09/11/2017 06:08 PM IST
Pawan 25th movie theme out

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మ్యూజిక్ బిట్ తో ఒక్కసారిగా అంచనాలను మార్చి పడేసింది. గత రెగ్యులర్ సినిమాల్లోగా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్ మసాలానే త్రివిక్రమ్ పవన్ కోసం వండి ఫ్యాన్స్ కు వార్చబోతున్నట్లు తెలుస్తోంది.

అత్తారింటికి దారేది తరహాలో సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తూనే మరో పక్క పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ మసాలా యాక్షన్ ను బాగా దట్టించాడని చెప్పుకుంటున్నారు. మేనత్త .. మేనల్లుడి సెంటిమెంట్ హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తెరకెక్కుతోన్న సినిమాలో, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా నిలుస్తుందట. మరి తండ్రి క్యారెక్టర్ ఎవరన్న విషయం మాత్రం ఇంకా బయటకు పొక్కలేదు.

త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా .. షూటింగ్ దశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఇక్కడ పవన్ .. కీర్తి సురేశ్ ల పై ఒక పాటను .. కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళుతుంది. అక్కడ మేజర్ షెడ్యూల్ షూటింగ్ ను ప్లాన్ చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles