భారీ డిజాస్టర్ అయినా ఛాన్సులు | Mega Akash Romance with Akkineni Hero.

Mega akash in maruthi movie

Mega Akash, Niitin Movie, Naga Chaitanya, Maruthi Director, Mega Akash Naga Chaitanya, Naga Chaitanya Mega Akash, Mega Akash Maruthi Movie

Mega Akash finalized for Naga Chaitanya and Maruthi Movie. Officially not Announced yet.

చైతూ-మారుతి మూవీలో మేఘా ఆకాశ్

Posted: 09/12/2017 03:20 PM IST
Mega akash in maruthi movie

భారీ పరాజయం ఖాతాలో పడిన హీరోయిన్ ను తర్వాత ఎవరైనా పెద్దగా పట్టించుకుంటారా? అంటే కష్టమే అని చెప్పుకోవాలి. కానీ, మేఘా ఆకాశ్ కు మాత్రం ఫేట్ బాగానే టర్న్ అయ్యిందని చెప్పుకోవాలి. పెద్దగా హీరోయిన్ ఫీచర్స్ లేకపోయినా తమిళ్ లో గౌతమ్ మీనన్ చిత్రంలో చేసిందన్న కారణంగా హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకుంటుంది.

తెలుగు తెరకి 'లై' సినిమా ద్వారా పరిచయం అయిన ఈ మళయాళం బ్యూటీ డిజాస్టర్ ను చవిచూసింది. అయినా పవన్ కళ్యాణ్ నిర్మాతగా నితిన్ హీరోగా తీస్తున్న సినిమాలోను ఈ అమ్మాయి ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. మధ్యలో మరో రెండు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. అయినప్పటికీ మరో సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

దర్శకుడు మారుతి .. చైతూ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే ను తీసుకోవాలని అనుకున్నాడు. అయితే చైతూతో తాను చేయనున్న సినిమా కోసం అప్పటికే ఆమెను చందూ మొండేటి సంప్రదించాడట. దాంతో ఒకరిద్దరు పేర్లను పరిశీలించిన మారుతి, చివరికి మేఘా ఆకాశ్ ను కథానాయికగా ఎంచుకున్నాడట. ముందు సమంతను అనుకున్నప్పటికీ.. చైతూ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. దీపావళికి ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles