మనోజ్ సినిమాకు కొత్త కష్టాలు.. ’అసలు‘ సీన్లే లేపేయాలంట! | Censor Troubles for Manoj's Untold Story

Censor troubles for manoj s okkadu migiladu

Manchu Manoj, Okkadu Migiladu Movie, Censor Problems, Tollywood Movies, OkKadu Migiladu Objections

Censor Troubles for Manchu Manoj's Okkadu Migiladu Movie. Exciting Scenes may Chop from Manchu manoj's Okkadu Migiladu

ఒక్కడు మిగిలాడుకి సెన్సార్ ట్రబుల్స్

Posted: 09/11/2017 03:10 PM IST
Censor troubles for manoj s okkadu migiladu

సెన్సార్ సమస్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చిత్రానికి చాలా ఇబ్బందకరంగా మారాయి. సినిమాలకు కీలకంగా భావించే ఎపిసోడ్లనే లేపేయాలంటూ బోర్డు కోరటంతో మేకర్లు తలలు పట్టుకుంటున్నారు.

మంచు మనోజ్ కుమార్ హీరోగా ఒక్కడు మిగిలాడు చిత్రం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే సెన్సార్ కోసం వెళ్లిన ఈ సినిమాకు ఇప్పుడు చిక్కులు ఎదురయ్యాయి. సినిమాలో 40 నిమిషాలపాటు సముద్రంలో ఉత్కంఠగా సాగే సన్నివేశాలు ఉన్నాయంట. అయితే ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు తొలగించాలని చెప్పింది.

దీంతో సినిమాకు మేజర్ హైలెట్ గా అవుతుందని భావించిన ఎపిసోడ్ నే లేపేస్తే ప్రేక్షకులకు సినిమా ఎక్కదనే చిత్ర యూనిట్ భావిస్తోందంట. మరి సినిమా రిలీజ్ కు ఏర్పడ్డ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి. మంచు విష్ణు డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ఎల్టీటీఈ చీఫ్ గా ఓ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రం కోసం మనోజ్ విపరీతంగా బరువు పెరిగాడు కూడా. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఒక్కడు మిగిలాడు తెరకెక్కుతుండగా.. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh