NTR speech at jai lava kusa Pre Release Event.

Ntr jai lava kusa pre release event

Jai Lava Kusa Trailer Launch, Jai Lava Kusa, Jai Lava Kusa Trailer Review, Jai Lava Kusa Pre Release Event, Jai Lava Kusa NTR Speech, Jai Lava Kusa Trailer Launch NTR Speech, Jai Lava Kusa Pre Release NTR Speech, Jai Lava Kusa Actress Speechs

Jai Lava Kusa Trailer Launch and Pre Release Event. I am indebted to fans forever NTR Added.

ఈ జన్మకు అభిమానులతోనే ఉంటా: ఎన్టీఆర్

Posted: 09/11/2017 06:58 AM IST
Ntr jai lava kusa pre release event

‘నాన్నా.. ఈ జన్మకు అభిమానులతో ఉండిపోతాను. మరో జన్మలో మీ రుణం తీర్చుకుంటాను’ అంటూ తండ్రి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో అన్నారు. ‘జై లవ కుశ’ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాత కళ్యాణ్ రామ్, హరికృష్ణ, దర్శకుడు బాబీ, మరో స్టార్ దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్లు నివేథా థామస్, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.

'ఈ చిత్రం కథ విన్న తర్వాత అద్భుతంగా ఉందని బాబీకి చెప్పాను. ఆ తర్వాత ఈ కథ గురించి ఇద్దరు వ్యక్తులతో పంచుకున్నాను. వాళ్లిద్దరూ కూడా ‘కథ చాలా బాగుంది’ అని చెప్పారు. అయితే.. వాళ్లిద్దరి పేర్లు ఇప్పుడే చెప్పను. ఈ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ల పేర్లు చెబుతాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని.. బాగుంటుందని.. హిట్టవుతుందని నా నమ్మకం...ఈ చిత్రం తప్పకుండా మన గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకం నాకుంది... ఈ సినిమా చూసి ఎంత బాగా తీశారని అభిమానులు అనుకోవాలి... తల్లిదండ్రులూ అనుకోవాలి' అన్నారు.

ఇక ‘జై లవ కుశ’ సినిమా కేవలం ‘జై’ ఒక్కడి సినిమా కాదండి. ఈ చిత్రం జై, లవ, కుశ.. ఈ మూడింట్లో ఏ ఒక్క పేరు పోయినా కరెక్టవదు. ఈ చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ అంకితం. ఈ చిత్రం చూసి అన్నదమ్ములందరు కూడా ఇన్ స్పైర్ అవుతారని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

కాగా, అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రంలోని ఓ డైలాగ్.. ‘ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణుడ్ని సంపాలంటే సముద్రమంత ద ద దా.. దా..దైర్యముండాల.. ఉందా?’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి. ట్రైలర్ తోపాటు పాటల ప్రోమోలను కూడా రిలీజ్ చేసేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles