Shradda Kapoor Double Surprise for Saaho.

Saaho actress shadda double treat

Shraddha Kapoor, Saaho Movie, Saaho Actress, Shraddha Kapoor Triple Role, Shraddha Kapoor New Movie, Shraddha Kapoor Double Role

Shraddha Kapoor playing a double role in Prabhas' Saaho. "Shraddha will be seen playing two characters; both of them are important. While one is boisterous and performs action stunts, the other is a timid person.

సాహోలో శ్రద్ధా డబుల్ సర్ ప్రైజ్?

Posted: 09/09/2017 04:10 PM IST
Saaho actress shadda double treat

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి.

తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. సౌత్ లో మళయాళ, కన్నడ భాషా ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు అందుతోంది. చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది.

ఇక ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందన్నది తాజా సమాచారం. ఒక పాత్ర ప్రభాస్ జోడీగా కనిపిస్తే .. మరో పాత్ర నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఇది ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోన్న టాక్ మాత్రమే. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles