Manchu Vishnu Shares Rare Pic With Mohan Babu.

Manchu vishnu about mohan babu

Manchu Vishnu, Alludugaru Movie, Alludugaru Mohan Babu Sets, Alludugaru Vishnu Pic

Manchu Vishnu Shares Pic With Mohan Babu in Alludugaru Sets. My Father is my Real Hero Vishnu Added.

నాన్నే నా రియల్ హీరో: మంచు విష్ణు

Posted: 09/09/2017 04:49 PM IST
Manchu vishnu about mohan babu

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఓ ‘ప్రత్యేక’ గుర్తింపు ఉందనే చెప్పుకోవాలి. సాధారణంగా వేరే ఏ సినీ కుటుంబంలో అయినా వివాదాలు, విభేధాలు అంటూ వార్తలు వస్తాయి గానీ, మోహన్ బాబు ఫ్యామిలీ కటుంబం గురించి ఎప్పుడూ ఎలాంటి వార్తలు రాలేదనే చెప్పాలి. అందుకు కలెక్షన్ కింగ్ క్రమశిక్షణే కారణమని చెప్పాలి.

ఆ సంగతి పక్కన పెడితే సోష‌ల్ మీడియాలో కూడా ఆ ఫ్యామిలీ అంతా యాక్టివ్ గా ఉంటుంది కూడా. వాళ్లలో మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్లకు పెట్టింది పేరు. త‌న సినిమాల‌తో పాటు త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షేర్ చేస్తుంటాడు మంచు వార‌బ్బాయి. తాజాగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సుమారు ప‌దేళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో త‌న నాన్నతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.

మోహ‌న్ బాబు అల్లుడు గారు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న‌ప్పుడు తీసిన ఫోటో అది. బాబు పక్కన కూర్చున్న విష్ణు ఇంట్రెస్టింగ్ గా ఏదో వింటున్నట్లు ఉంది. సినిమాలోని పాటకు అర్థం తన తండ్రి వివరిస్తున్నాడని.. త‌న నాన్నే త‌న హీరో అని విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles