ఈసీ నో యాక్షన్.. బాలయ్యపై హైకోర్టులో పిటిషన్ | Case Filed Against Balayya in High Court

Petition filed against balayya in hc

Balakrishna, Nandyala By Election, Money Distribution, Election Commission, EC Balayya, Balakrishna High Court, YSRCP Leader Shiva Kumar

YSRCP Leader Shiva Kumar filed Case against Actor, MLA Balakrishna. Over Nadyala Money Distribution and EC take no action against Balayya.

బాలకృష్ణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

Posted: 08/30/2017 02:51 PM IST
Petition filed against balayya in hc

టాలీవుడ్ అగ్రనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు కోర్టు చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. తెలుగు దేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా డబ్బులు పంచారన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే.

ఓ కార్యకర్తకు 100 నోటును ఇస్తున్నట్లు ఫోటో రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్సీపీకి చిక్కటంతో ఏకీపడేసింది కూడా. ఇప్పుడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే శివ కుమార్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. బాలయ్య ఓటర్లను ప్రలోభపెట్టాడంటూ ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు.

ఈ విషయంలో ఈసీ హిందుపురం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయమూర్తిని శివ కోరారు. ప్రజా ప్రతినిధుల చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద బాలయ్యపై చర్యలు తీసుకోవాల్సిందిగా శివ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala By Poll  TSP MLA Balakrishna  High Court Petition  

Other Articles