జై లవకుశ.. ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్ | No Audio Function for NTR Jai Lava Kusa

Jai lava kusa pre release function fix

NTR, Jai Lava Kusa, No Audio Function, Pre Release Event, Jai Lava Kusa Release Date, Jai Lava Kusa Trailer, NTR Kusa Reaser

NTR’s Jai Lava Kusa makers have canceled the audio launch function. There is an ongoing issue with rains, and on top of that, the Vinayaka nimarjan will happen over the weekend. Keeping the safety of public and security problem as the top priority, Nandamuri Arts has avoided having a grand audio launch altogether for Jai Lava Kusa. Instead, it will be released directly into the market on September 3.The good news is that a grand function will be help a week later on September 10th.

జై లవకుశ ప్రీ రిలీజ్ పంక్షన్ ఫిక్స్

Posted: 08/30/2017 03:47 PM IST
Jai lava kusa pre release function fix

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ పాటలు నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ కానున్నాయి. ఈ చిత్రానికి ఆడియో పంక్షన్ సెప్టెంబర్ 3న ఉంటుందని ఇది వరకే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అలాంటిదేం లేదని నిర్మాణ సంస్థ నందమూరి ఆర్ట్స్ తన ట్విట్టర్ పేజీలో తెలియజేసింది.

ఆ తేదీనే ఆడియో వేడుక నిర్వహించాలని అనుకున్నాం. కానీ, భారీ వర్షాలు, వినాయక నిమజ్జనం వరుసగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేయటం సరైంది కాదు. అందుకే అదే తేదీన పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాం అంటూ ట్వీట్లు చేసింది.

ఇక అభిమానుల కోసం ఆ మరుసటి వారం అంటే సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. త్వరలో కుశ టీజర్ ను రిలీజ్ చేసి ప్రీ రీలీజ్ పంక్షన్ లో ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 21న జై లవకుశ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Jai Lava Kusa  Pre Release Event  

Other Articles