గే వీడియోతో నటిపై తీవ్ర దుమారం | Bollywood Actress Gay Wed Video Create Rucks

Actress raveena tandon criticism in social media

Raveena Tandon, Raveena Tandon Gay Video, Raveena Tandon New Video, Raveena Tandon Controversy, Raveena Tandon Gay Wedding, Raveena Tandon Old Video

Raveena Tandon Tweets A Video Of A ‘Beautiful’ Gay Wedding, Faces Backlash From People

నటి రవీనా టండన్ వీడియోపై ఫైర్

Posted: 08/28/2017 03:56 PM IST
Actress raveena tandon criticism in social media

సీనియర్ నటి రవీనా టండన్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో హాట్ టాపిక్ గా మారిన వీడియోను ఆమె పోస్ట్ చేయటమే అందుకు కారణం.

2015లో స్వ‌లింగ వివాహం చేసుకున్న సందీప్, కార్తీక్‌ల పెళ్లి వీడియోను ర‌వీనా టాండ‌న్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు. వారి జంట ఒక్క‌టైనందుకు అభినందనలు తెలియ‌జేస్తున్నా అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అయితే భారతీయ ఆచారాలను మంటగలుపుతూ చేసిన పనికి నటి మద్ధతేంటని పలువురు ఆమెపై మండిపడ్డారు. సందీప్‌, కార్తీక్‌లు మన సంప్ర‌దాయంలో ఒక్కటై దేశ ప‌రువును తీశార‌ని ఆక్షేపించారు.

అయితే కొందరు మాత్రం ఇలాంటి వివాహాల‌ను అర్థం చేసుకోవాలంటే పెద్ద మ‌నసు కావాల‌ని, అది భార‌తదేశంలో చాలా మందికి లేనందుకు సిగ్గుగా ఉంద‌ంటూ కామెంట్లు పెట్టారు. విమర్శలు వస్తున్నా ర‌వీనా వైపు ఎలాంటి రియాక్షన్ లేదు. అసలు ఎప్పుడో జ‌రిగిన పెళ్లిని ఆమె మ‌ళ్లీ ఎందుకు తెర‌మీదికి తీసువ‌చ్చారో వివాదంలో ఎందుకు ఇరుక్కుందని పలువురు ప్రశ్నిస్తున్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raveena Tandon  Gay Wed Video  Controversy  

Other Articles