బిగ్ బాస్ హౌజ్ కి బాలయ్య.. అంత సీన్ ఉందా? | Bigg Boss Likely to Visit NTR Bigg Boss House

Balayya to attend ntr bigg boss show

Balakrishna Bigg Boss, Balayya NTR Bigg Boss, Balayya Bigg Boss,Paisa Vasool Promotions Balayya NTR Bigg Boss Show

Balakrishna in NTR's Bigg Boss house. Rumours Surrounded that Balayya Promote his new movie Paisa Vasool in NTR's Show.

బిగ్ బాస్ కు బాలయ్య.. నిజమేనా?

Posted: 08/26/2017 12:57 PM IST
Balayya to attend ntr bigg boss show

టాలీవుడ్ లో ఇప్పుడొక కొత్త సంప్రదాయం నడుస్తోంది. పాపలర్ అయిన షోలను వేదికగా చేసుకుని తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవటం అనే ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా `బిగ్‌బాస్‌` లాంటి హై రేటింగ్ కార్య‌క్ర‌మాల‌ను వేదిక చేసుకోవ‌డం కామ‌నే. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం హీరో రానా, ‘ఆనందో బ్రహ్మ’ ప్రమోషన్‌కు తాప్సీ, ‘అర్జున్ రెడ్డి’ ప్ర‌చారం కోసం విజయ్
దేవరకొండ బిగ్‌బాస్ ఇంటికి వ‌చ్చారు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో బిగ్ బాస్ ను అప్రోచ్ కాబోతున్నాడనే వార్త సంచలనంగా మారింది.

త్వ‌ర‌లోనే `పైసా వ‌సూల్` సినిమా ప్ర‌మోష‌న్ కోసం బాల‌కృష్ణ బిగ్‌బాస్ హౌస్‌కి రానున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ వార్త‌లో నిజ‌మెంతుందో తెలియ‌క‌పోయినా `అబ్బాయి కార్య‌క్ర‌మానికి బాబాయ్‌` అంటూ అప్పుడే అభిమానులు ఫేస్‌బుక్ పోస్టులు ప్రారంభించారు. గ‌తంలో వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఒక‌వేళ బాల‌య్య బిగ్‌బాస్ హౌజ్ కి విచ్చేస్తే, ఆ వార్తల్లో నిజం లేద‌నే విష‌యం క‌చ్చితంగా తెలుస్తుంద‌ని ఇరు న‌టుల‌ అభిమానులు ఆశ ప‌డుతున్నారు.

అయితే బాలయ్య ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడన్నదే చాలా మంది అభిప్రాయం. తనకు బదులుగా చిత్ర యూనిట్ లో ఎవరినైనా పంపే ఛాన్స్ ఉంది తప్ప తాను మాత్రం వెళ్లడని, దీంతో బిగ్ బాస్ ప్రమోషన్ వార్త ఉత్తదేనని చెబుతున్నారు. ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న విడుద‌ల కాబోతోంది. ఆలోపు బాలయ్య వస్తే అది నిజంగానే పెద్ద వండర్ అయి తీరుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Bigg Boss Show  NTR  Paisa Vasool Promotions  

Other Articles