ఐష్ మిస్.. తమన్నాని తీసేసుకున్నారు | Kalyan Ram New Movie Actress Replaced

Tamanna in kalyan ram new movie

Tamanna Kalyan Ram, Kalyan Ram New Actress, Another Top Heroine For Kalyan Ram, Aishwarya Lakshmi Out Kalyan Ram movie, Kalyan Ram Tamanna, Tamanna Telugu Movie 2017

Tamanna Replaced Aishwarya Lakshmi with Kalyan Ram New Movie. We have updated you that the makers had decided to replace the Malayalam heroine Aishwarya Lekshmi who was also seen during the Muhurat event. The fresh update is that Tamanna was roped in, to romance the Nandamuri hero in his next untitled movie.

కళ్యాణ్ రామ్ మూవీలో తమన్నా?

Posted: 08/26/2017 12:45 PM IST
Tamanna in kalyan ram new movie

తెలుగులో అగ్ర కథానాయకుల సరసన వరుస సినిమాలను చక్కబెట్టిన తమన్నాకు ఇప్పుడు ఇక్కడ గట్టి పోటీ ఎదురవుతోంది. 'బాహుబలి' తరువాత మరింత దూసుకుపోతుందనుకున్న తమన్నాకి అవకాశాలు తగ్గడం ఆశ్చర్యమే. కోలీవుడ్ లో ఛాన్సులు క్యూ కడుతున్నా.. తెలుగులో మాత్రం సినిమాలు లేకుండా పోయాయి. ఆ మధ్య బాలయ్య 102 లో ఛాన్స్ మిస్సయ్యిందని చెప్పుకోవటంతో మిల్కీ ఛాప్టర్ క్లోజ్ అనుకున్నారు.

బిగ్గెస్ట్ ప్రాజెక్టు తర్వాత ఇంతవరకూ ఒక్క తెలుగు సినిమా కూడా లేకుండా పోయింది. అయితే ఇప్పుడు తెలుగు నుంచి ఆమెకి ఒక ఛాన్స్ వెళ్లిందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు జయేంద్ర సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను సంప్రదించగా .. ఓకే చెప్పేసిందట. నిజానికి ఈ చిత్రానికి ముందుగా మళయాళ డెబ్యూ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీని తీసేసుకున్నారు. పూజా కార్యక్రమాలకు ఐష్ హాజరయ్యింది కూడా. కానీ, స్క్రీన్ టెస్ట్ లో ఫేల్ కావటంతో ఆమె ప్లేస్ లో తమ్మూని తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న 'ఎమ్మెల్యే' పూర్తి కాగానే, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు తమన్నా కోలీవుడ్ లో విక్రమ్ స్కెచ్ తోపాటు మళయాళంలోనూ ఓ సినిమాను చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Directior Vijayendra  Tamanna  Aishwarya Lakshmi  

Other Articles