విజయ్ అమితాబ్.. తెలంగాణ మెగాస్టార్... వీహెచ్ కి నా ముద్దులు లేవ్... | Maverick Director Compare Vijay with Megastars

Rgv reaction after arjun reddy release

RGV VH Kiss, RGV Praise Arjun Reddy, Vijay Devarakonda Megastar, Telangana Megastar, Vijay Devarakonda Ram Gopal Varma, Ram Gopal Varma Kiss V Hanumantha Rao, VH RGV Arjun Reddy

Ram Gopal Varma Happy with Arjun Reddy, Praised Vijay Devarakonda and Photo Viral Kiss with VH in Social Media.

విజయ్ పై ప్రశంసలు.. వర్మ వేషాలు తగ్గటం లేదుగా...

Posted: 08/26/2017 11:05 AM IST
Rgv reaction after arjun reddy release

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా హీరో విజయ్ దేవరకొండను ఓ రేంజ్ లోనే పొగిడేశాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'అర్జున్ రెడ్డి' రిలీజ్ అవ్వటం, ఓ వర్గం ఆడియన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చటంతో వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఈ తరం హీరోలంతా తమ హీరోయిజాన్ని చూపించడానికి సాంకేతికతపై ఆధారపడుతున్నారనీ, అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడని ఆయన అన్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్ లా మారతాడనీ, తెలంగాణలో తొలి మెగాస్టార్ గా కొనసాగుతాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ పొగడ్తలు ఆ యంగ్ హీరోపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కంగారు పడుతున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి ముద్దు పోస్ట‌ర్ల విష‌యంలో వీహెచ్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వీహెచ్‌కి ఆర్జీవీ ముద్దు పెడుతున్న‌ట్లుగా ఉన్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

గ‌తంలో ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్య‌ప్‌కు ముద్దు పెడుతున్న ఫొటో ఒక‌దాన్ని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అదే ఫొటోలో అనురాగ్ స్థానంలో వీహెచ్ ముఖాన్ని ఎవ‌రో నెటిజ‌న్ మార్ఫింగ్ చేశాడు. దీంతో వీహెచ్ బుగ్గ‌పై ఆర్జీవీ ముద్దు పెడుతున్న‌ట్లు ఫొటో త‌యారైంది. ఈ ఫొటోను ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. `బాహుబ‌లి చిత్రానికి ప‌నిచేసిన 27 మంది కంప్యూట‌ర్ నిపుణులు క‌లిసి నేను వీహెచ్ బుగ్గ‌పై ముద్దు పెడుతున్న‌ట్లుగా చేయ‌వ‌చ్చు. కానీ అవ‌తార్ సినిమా ద‌ర్శ‌కుడు జేమ్స్ కేమెరూన్ త‌ల‌చుకున్నా నాతో వీహెచ్ పెదాల‌పై ముద్దు పెట్టించ‌లేడు` అని ఆర్జీవీ పోస్ట్ రాశాడు.

తనని పొగుడుతూ విజయ్ పెట్టిన సందేశానికి హీరో విజ‌య్ స్పందిస్తూ - `హ‌నుమంత‌రావును మీరు కిస్ చేశారో లేదో తెలియ‌దు కానీ, మిమ్మ‌ల్ని క‌లిసిన‌పుడు నేను క‌చ్చితంగా కిస్ చేస్తాను` అని బదులిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Vijay Devarakonda  V Hanumantha Rao  

Other Articles