సన్ నెట్ వర్క్ ఛానెల్ లాస్.. ఆ ఛానెల్ మూసేస్తున్నారు | Kannada Old News Channel Ready to Close

Udaya news shutting shop

Sun Network, Kannada News Channels, Kannada Udaya News Tv Close, Udaya News Channel Close, Udaya News Channel Wind Up, Udaya News Channel Shut Down

Oldest news channel in Kannada, Udaya News, is shutting shop. In a mandatory filing before the Labour Department, Sun TV Network that runs the channel has said that the channel will stop telecast from October 24 and that 73 employees will lose their jobs. The statement of reasons says, “We have been operating Udaya News division for the last 19 years and have made substantial investments in building the news business in Karnataka.

సన్ ఆ న్యూస్ ఛానెల్ మూతపడుతోందిగా...

Posted: 08/24/2017 01:04 PM IST
Udaya news shutting shop

సౌతిండియాలో అతిపెద్ద నెట్ వర్క్ గా పేరున్న సన్ నుంచి ఓ ఛానెల్ మూతపడుతోంది. కన్నడ న్యూస్ ఛానెల్ ఉదయ న్యూస్ ను మూసేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉదయ న్యూస్ సుదీర్ఘ కాలంగా 24 గంటల వార్తలతో కన్నడిగులను ఆకట్టుకుంది. అయితే ప్రేక్షకాదరణ మూటగట్టుకోవడంలో విఫలమయ్యామని, న్యూస్ ఛానెల్ నష్టాల బారిన పడిందని, న్యూస్ ఛానెల్ నిర్వహణ భారంగా మారిందని, అందుకే ఛానెల్ ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చామని సన్ నెట్ వర్క్ యాజమాన్యం ప్రకటించింది.

ఈ మేరకు కర్ణాటక లేబర్ మినిస్ట్రీకి సమాచారం అందించింది. ఈ నెల 24 నుంచి అంటే నేటి నుంచి వార్తల ప్రసారాలు ఆపేస్తున్నామని, తమ సంస్థలో పని చేస్తున్న 73 మంది ఉద్యోగులను వదులుకుంటున్నామని సన్ నెట్ వర్క్ తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించామని తెలిపింది. ప్రేవేటు ఛానెల్స్ మధ్య పోటీని తట్టుకోలేకపోయామని, న్యూస్ ఛానెల్ గా అలరించడంలో విఫలమయ్యామని ఉద్యోగులు పేర్కొన్నారు.

కాగా సన్ నెట్ వర్క్ కు కన్నడలో ఉదయ టీవీ, ఉదయ మ్యూజిక్, ఉదయ మువీస్, ఉదయ కామెడీ ఛానెల్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి బాగానే ఉందని, రెవెన్యూ బాగానే ఉందని సన్ నెట్ వర్క్ ఓ ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Sun Network  Udaya News Channel  

Other Articles