తెలుగు అప్ కమింగ్ హీరోయిన్ పై రెండుసార్లు రేప్ అటెంప్ట్.. కేసు | Hero and Director Rape Attempt on Actress

Telugu actress files rape attempt case

Actress Rape Attempt, Serial Actress Rape Attempt, Actress Rape Attempt Case, Telugu Actress rape Attempt Vijayawada, Director Chalapathi Hero Srujan, Chalapathi and Srujan, Actress Rape Attempt, Serial Actress Rape Attempt, Director Hero Rape Attempt

Telugu Actress Rape Attempt by Hero And Director. Actress Files Case against them in Vijayawada Police Station. Police Arrested Against Director Chalapathi, Srujan and Probed.

తెలుగు నటిపై అత్యాచారయత్నం.. డైరక్టర్, హీరోపై కేసు

Posted: 08/16/2017 01:10 PM IST
Telugu actress files rape attempt case

సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి తనపై అత్యాచార యత్నం చేశారంటూ ఓ వర్థమాన తెలుగు నటి పోలీస్ ఫిర్యాదు చేయటం విజయవాడలో కలకలం రేపింది. దీంతో దర్శకుడు చలపతి, హీరో సృజన్ లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళ్లితే... హైదరాబాద్ లో సీరియళ్లలో నటించే ఓ యువతికి తమ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తామని చెప్పటంతో విజయవాడకు వెళ్లింది. అక్కడి నుంచి భీమవరంలో షూటింగ్ ఉందని చెప్పి యువతి కారులోనే బయలుదేరారు. కారులో వెళ్తున్న సమయంలోనే ఆమెపై అత్యాచారయత్నం చేయగా, వారిని ప్రతిఘటించడంతో నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైంది. చికిత్స తీసుకుని మరో కారులో షూటింగ్ స్పాట్ కు బయల్దేరగా దారిలో మరోసారి తనపై అత్యాచారయత్నం చేసినట్టు బాధితురాలు తెలిపింది.

 

అతి కష్టం మీద తప్పించుకుని విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారికి సహకరించలేదని తనపై దారుణంగా దాడి చేశారని, తానెక్కడ కారులోంచి దూకేస్తానోనని దర్శకుడు చలపతి వేగంగా కారు నడిపి లారీకి ఢీకొట్టి యాక్సిడెంట్ కు కారణమయ్యాడని తెలిపింది. తన కారు గురించి అడిగితే బూతులు తిట్టారని, అనవసర రాద్దాంతం చేస్తే కెరీర్ నాశనమవుతుందని హెచ్చరించారని చెప్పింది. తనకు ఛాన్సులు వచ్చినా, రాకపోయినా వారికి మాత్రం శిక్ష పడాలని కోరుతోంది ఆ నటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Actress  Rape Attempt  Vijayawada  

Other Articles