అచ్చం హాలీవుడ్ సినిమాలోలాగా ఆమెపై దాడి | Wheelchair Actress Attacked as Edward Scissorhands Scene

Scissors attack on actress

Edward Scissorhands, Liz Carr Attack, Liz Carr Edward Scissorhands, Edward Scissorhands Head Injures, Edward Scissorhands News, Edward Scissorhands Silent Witness Drama, Actress Liz Carr

'Thank you for all the love': Wheelchair-bound Silent Witness actress, 45, Liz Carr who was stabbed in the head with scissors on a busy London street says she is overwhelmed by messages of support from her co-stars. 'Edward Scissorhands' attacker’ compared with this scene.

హాలీవుడ్ నటిపై కత్తెరతో దాడి

Posted: 08/16/2017 02:17 PM IST
Scissors attack on actress

హాలీవుడ్ లో మరో నటిపై భౌతిక దాడి చోటుచేసుకుంది. నటి లిజ్ కర్ (45)పై 20 ఏళ్ల ఓ యువకుడు కత్తెరలతో దాడి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఆమెకు పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. పట్టపగలు, నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఈ దారుణం చోటు చేసుకోవటం విశేషం.

వీల్ చైర్ లోనే ఉండే లిజ్ కర్, బీబీసీ లో ప్రసారమయ్యే సైలెంట్ విట్ నెస్ అనే క్రైమ్ సిరీస్ డ్రామాలో నటిస్తోంది. లండన్ లోని యూస్టన్‌ స్టేషన్‌ వద్ద తన కేర్‌ టేకర్‌ తో పాటు ఆమె వెళ్తుండగా, ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడి చేశాడు. ఆమె తలపై కత్తెరలతో పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె తల మొత్తం రక్తసిక్తమైంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దాడికిపాల్పడి పారిపోతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిగిన తరువాత తాను క్షేమంగానే ఉన్నానని పేర్కొన్న లిజ్ కర్, తాను కోలుకోవాలనుకున్న వారందరికీ థ్యాంక్స్ తెలిపింది. అయితే ఆ వెంటనే లిజ్ ఫ్రెండ్ ఒకరు చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 1990లో హాలీవుడ్ లో ఎడ్వర్డ్స్ సిజర్ హ్యాండ్స్ అనే ఓ మూవీ వచ్చింది. పుట్టుకతోనే కత్తెర చేతులతో పుట్టిన వ్యక్తి చివరకు ప్రేమను కూడా దూరం చేసుకునే విషాద గాథ అది. అచ్చం అందులో ఉన్నట్లే ఈ దాడి ఉందంటూ పోలిక పెట్టడంతో లిజ్ సహా అంతా నవ్వుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Silent Witness  Actress Liz Carr  Edward Scissorhands  

Other Articles