బాబుపై షాకింగ్ కామెంట్స్... లీడర్లంటే ఎన్టీఆర్, వైెఎస్ లే.. పవన్ తో గొడవ గురించి... | Daggubati Producer Sensational Comments on Politics and TDP

Suresh babu about politics

Producer Suresh Babu, Suresh Babu Interview, Suresh Babu Pawan kalyan Clash, Suresh Babu Pawan Kalyan, Suresh Babu About Political Entry, Suresh Babu Chandrababu Naidu, Suresh Babu Andhra Pradesh Politics, Suresh Babu YSRCP, Suresh Babu Pawan Kalyan, Suresh Babu Nene Raju Nene Mantri Promotions, Suresh Babu Latest Interview

Producer Suresh Babu about Political Entry. Intresting Comments on Chandrababu Naidu. Beside that Suresh Babu Clarity on Clash with Pawan Kalyan.

రాజకీయాలపై సురేష్ బాబు.. పవన్ తో గోడవేం లేదు

Posted: 08/16/2017 10:33 AM IST
Suresh babu about politics

దగ్గుబాటి వంశంలో రామానాయుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బాపట్ల ఎంపీగా గతంలో పని చేసిన ఆయన ప్రజల్లో మంచి సింపథీనే సంపాదించుకున్నారు. తర్వాత రాజకీయాలకు దూరమైన తర్వాత నేను రాజకీయాలకు సరిపోను... అంటూ పలు ఇంటర్వ్యూలలో ఆయన వ్యాఖ్యలు చేయటం చూశాం. టీడీపీతోనే సాగిన రామానాయుడు ప్లేస్ లో సురేష్ బాబు వస్తారా? అన్న ఊహాగానాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలే చేశారాయన.

తనకు రాజకీయాలంటే పడదని, ప్రస్తుత నేతల్లో రాజకీయ విలువలు నానాటికీ దిగజారుతున్నాయని ఆయన అన్నారు. ఒక పార్టీ తరపున పోటీ చేసి, అవతలి పార్టీ ఏదైనా ఆశ చూపితే అందులోకి దూరిపోతున్నారని, ఇది ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందని తెలిపారు. జనం పార్టీమీద అభిమానంతోనో, మీమీద నమ్మకంతోనో ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే పనిచేయాలని... పార్టీ మారిపోతే విలువలను వదులుకోవడమే అవుతుందని అన్నారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు ఇప్పుడో ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు.

రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు. 40 ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబులో మాత్రం ఆ లక్షణం మచ్చుకైనా కనిపించటం లేదన్న ఆయన కేవలం మేనేజింగ్ రాజకీయాలను మాత్రమే నడపుతున్నాడంటూ పేర్కొన్నాడు. తాను రాజకీయాల్లో రావటం అనేది తన చేతుల్లో లేదని, భవిష్యత్తే దానిని నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల టైంలో వచ్చిన వివాదంపై స్పందిస్తూ అది ఓ చిన్న ఇష్యూ మాత్రమే అని, తర్వాత అది సర్దుకుందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Babu  Political Entry  Chandrababu Naidu  

Other Articles