రాజా ది గ్రేట్... పాత బాలీవుడ్ మూవీ రీమేకా? | Raja The Great Compare with ollywood Movie.

Raja the great teaser release

Raja The Great, Raja The Great Review, Raja The Great Teaser Review, Raja The Great Akshay Kumar Movie, Raja The Great Copy, Raja The Great Ravi Teja

Raja The Great Movie Teaser released. Compared with Akshay Kumar Old Movie with Blind Concept.

రాజా ది గ్రేట్ టీజర్ రిలీజ్.. కాపీనా?

Posted: 08/16/2017 09:08 AM IST
Raja the great teaser release

ఒక సినిమా పోస్టర్ దగ్గరి నుంచి ప్రతీ అంశాన్ని కాపీ మార్క్ ముడిపెట్టి పోల్చటం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. రవితేజ తాజా చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనున్న విషయం తెలిసిందే. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీనిని ఓ పాత బాలీవుడ్ సినిమాతో పోల్చి పడేస్తున్నారు కొందరు.

90వ దశకంలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. అందులో అక్కీ అంధుడిగా ఉంటాడు. మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్ తో కథ ఉంటుంది. దానిని ఇక్కడ కబడ్డీ నేపథ్యంగా మార్చి అనిల్ రావిపూడి తెరకెక్కించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కొన్ని సీన్లు కంపేర్ చేసుకుని సినిమాను డిసైడ్ చేయటం సరికాదన్నది దర్శకుడు అనిల్ వాదన. సినిమా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించానని చెబుతున్నాడు.

 

టీజర్ విషయానికొస్తే... ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేశారు." నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి" అంటూ ఎమోషన్ తో రాధిక చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. ''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. అక్టోబర్ లో రాజా ది గ్రేట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raja The Great  Ravi Teja  Teaser Review  

Other Articles