రాజకీయాల్లోకి ఉప్పీ.. కొత్త పార్టీ లేదా బీజేపీ? | Kannada Hero Upendra Likely to join in BJP

Hero upendra ready for politicals

Kannada Star Hero BJP, Upendra BJP, Uppi BJP, Uppi Amit Shah, Upendra Amit Shah, BJP Cine Glamour, Upendra New Party, Upendra Political Entry, BJP Karnataka Upendra

Kannada Actor Upendra may join BJP during Amit Shah visit. Rumours sorrounded that Uppi starts new party and merge with BJP.

రాజకీయాల్లోకి ఉపేంద్ర.. బీజేపీ లేదా కొత్త పార్టీ!

Posted: 08/12/2017 08:50 AM IST
Hero upendra ready for politicals

రాజకీయాల్లో సినీ గ్లామర్ ప్రచారం వరకు బాగానే సక్సెస్ అయినప్పటికీ, అందులో రాణించటమే వారికి కష్టతరంగా మారిపోతుంది. ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేకపోతున్నాం. అయితే పార్టీలకు మాత్రం వారి సేవలు కీలకంగా మారిపోతున్నాయి. అందుకే గాలం వేసి మరీ లాగేస్తున్నాయి.

ఉత్తర రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేస్తూ వస్తున్న భారతీయ జనతా దళ్ పార్టీకి ఇప్పుడు అది చాలా అవసరం. ఇప్పటికే తమిళనాట రజనీ, కమల్ పై దృష్టిసారించిన పార్టీలు ఇప్పుడు కన్నడ స్టార్లపై కన్నేశాయి. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పర్యటించనుండగా, ఆయన సమక్షంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఉప్పీ రాజకీయాలపై గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

కొత్త పార్టీ పెడతాడని, ఆపై దానిని బీజేపీలో విలీనం చేస్తాడని, ఇలా రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ అయితే వాటిని ఆయన ఖండించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో షా తో భేటీ అనంతరం ఉపేంద్ర మీడియాతో సమావేశమై, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి స్వయంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Upendra  Politics  Karnataka  BJP  

Other Articles