శృతీకి ఆ హీరోయిన్లను చూస్తే అంత బాధ ఎందుకు? | Shruti Haasan Clarity on Not Friendly Attitude

Shruti haasan about her friendly attitude

Shruti Haasan, Shruti Haasan Friends, Shruti Haasan Movies, Shruti Haasan Competition, Shruti Haasan Friendly Nature, Shruti Haasan about Calm Heroines, Shruti Haasan about Other Heroines, Michael Corsale Shruthi Haasan

Shruti Haasan who recently spotted with her boy friend Michael Corsale says about her friendly nature with other heroines.

ఫ్రెండ్లీ యాటిట్యూడ్ పై శృతీ క్లారిటీ

Posted: 08/12/2017 08:06 AM IST
Shruti haasan about her friendly attitude

బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్ సెల్ తో మాటిమాటికి ఓపెన్ గా చక్కర్లు కొడుతున్న కమల్ గారాలపట్టి శృతీహాసన్ ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్లతో కలిసి పని చేసిన దాఖలాలు లేవు. పైగా బయట పంక్షన్లలో పెద్దగా ఎక్కడా కలిసినట్లు కనిపించదు. తమన్నా, సమంత, రకుల్, కాజల్ ఇలా మిగతా వారంతా కలిసి పార్టీలు, సందడి చేయటం చూస్తుంటాం కానీ శృతీ మాత్రం ఎక్కడా కనిపించదు. అయితే తాను మాత్రం అందరితో ఫ్రెండ్లీగా మాత్రమే ఉంటానని చెబుతోందీ భామ.

ముభావంగా ఉంటూ, ఎవరితోనూ కలవకుండా సైలెంట్ గా ఉండిపోయే కొందరు హీరోయిన్లను చూస్తే నాకు బాధేస్తోందని అంటోంది. జీవితం చాలా చిన్నదని, అందివచ్చే ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ గడపాలని చెప్పిన ఈ సౌత్ సినిమా బ్యూటీ, సైలెంట్ గా ఉన్న సహ హీరోయిన్లతో మాటలు కలిపడంలో తనకెంతో ఆనందం లభిస్తుందని చెప్పుకొచ్చింది. మంచి జరిగితే పొంగిపోవడం, చెడు జరిగితే కుంగిపోవడం తనకు నచ్చదని, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా ఉంటూ చుట్టూ ఉన్న వారితో కలసి పోవడమే తనకు ఇష్టమని తెలిపింది.

కాగా, సంఘమిత్ర నుంచి అనూహ్యంగా ఎగ్జిట్ అయిన శ్రుతి ప్రస్తుతం తన తండ్రి నటిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రంలో ఒక్కదాంట్లో మాత్రమే నటిస్తోంది. త్వరలో తన కొత్త మ్యూజికల్ ఆల్బమ్ ను రిలీజ్ కు రెడీ చేస్తోంది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Tollywood  Heroines  

Other Articles