రీఓపెనింగ్ కు ముందే థియేటర్ కాలిపోయింది | Daggubati Theatre Burns in Fire Accident

Fire accident in suresh babu theatre

Suresh Mahal Theatre, Chirala Suresh Babu Theatre, Suresh babu Theater Burn, Chirala Daggubati Theater, Massive Fire Accident, Nene Raju Nene Mantri Movie

Massive Fire Accident at Suresh Mahal Theatre in Chirala. Due to a short circuit on Thursday incident occurred when few workers were doing repair work in the theaters.

కాలిపోయిన దగ్గుబాటి వారి థియేటర్

Posted: 08/11/2017 08:43 AM IST
Fire accident in suresh babu theatre

దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన ఓ థియేటర్ కాలిపోయింది. ప్రకాశం జిల్లా చీరాలలోని సురేష్ థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చీరాలలో ఇప్పటికీ టూరింగ్ టాకీసులే ఉన్నాయి. అయితే ఓవైపు అన్ని థియేటర్లు ఆధునిక సౌకర్యాలతో అలరిస్తున్నా చీరాల వాసులకు మాత్రం ఆ పాత థియేటర్లే గతవుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చ్ రోడ్ లోని తమ ధియేటర్ 'సురేశ్ మహల్'ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది దగ్గుబాటి ఫ్యామిలీ. ఏసీ, డిజిటల్ సౌండ్ వంటి హంగులతో సురేశ్ మహల్ ను సిద్ధం చేశారు.

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలతో నేడు రీఓపెనింగ్ కు ఏర్పాట్లు చేశారు. స్వయంగా రానానే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, గురువారం ఉదయం మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో ఓ ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి థియేటర్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Mahal Theater  Fire Accident  Nene Raju Nene Mantri  

Other Articles