ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను రణ్ బీర్ కపూర్ వంచకుడని సంబోధించడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. సంజయ్ దత్ జీవితాన్ని ఇతివృతంగా చేసుకుని తీస్తున్న చిత్రానికి సంబంధించిన సంజయ్ దత్ పాత్రను పోషిస్తున్న రణ్ బీర్ కపూర్.. సంజయ్ దత్ అంత నిజాయతీగా ఉండడం చాలామందికి సాధ్యం కాదని అన్నాడు. సంజు సార్ ను అభిమానించే వారున్నారు, అలాగే ద్వేషించే వారు కూడా ఉన్నారని అన్నారు. అయితే ఈ సినిమా గురించి అడగ్గానే సంజు సార్ నిజాయతీగా తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారని చెప్పాడు. ఆయన నిజంగా చాలా గ్రేట్ అని అన్నాడు.
తాను అంత నిజాయతీగా ఉండే వాడిని కాదని చెప్పాడు. తాను కానీ తనలాంటి ఎంతోమంది యువ నటులు కానీ ఎంత కష్టపడినా ఆయనలా కాలేమని అన్నారు. సంజు సార్ తనకు చాలా బాగా తెలుసని, ఆయనను తాను చిన్నతనం నుంచి చూస్తున్నానని చెప్పారు. ఇది నిజంగా ఆయన జీవితానికి సంబంధంచిన చిత్రం కాదని, ఇదోక సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రమని తెలిపాడు. ఒక మనిషి ఇలా తన జీవితంలోని అన్ని కోణాలను చిత్రం ద్వారా చూసిన తరువాత ఇది ఫిక్షన్ చిత్రమనే అంటానని రణ్ బీర్ కపూర్ అన్నారు. ఆయన నిజజీవితం నుంచి ప్రేక్షకులకు ఎంతో కొంత మంచి చేరుతుందని ఆశాభావంతోనే ఆయన తన జీవితంలోని ఘటనలను చెప్పాడని అన్నారు.
ఈ సినిమాలో నిజాలను నిక్కచ్చిగా చూపిస్తున్నామని రణ్ బీర్ చెప్పాడు. దీంతో సంజయ్ సార్ జీవితంలో చోటుచేసుకున్న ఎన్నో వివాదాస్పద అంశాలతో పాటు, తాను సాగించిన ప్రేమాయణాలను కూడా చూపించే అవకాశం ఉందని చెబుతున్నాడు. తామేమీ గాంధీ బయోపిక్ తీయడం లేదని, ఒక ఫ్రాడ్ (వంచకుడి) కథను తెరకెక్కిస్తున్నామని అన్నాడు. అయితే ఆయనను వంచకుడిగా మార్చిన వంచకుల నిజాలు కూడా బహిర్గతం అవుతాయని చెప్పారు. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ నటిస్తుండగా, దీనికి సంజయ్ దత్ స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more