బాలయ్య కొట్టలేదు.. ప్రేమతో తట్టాడంతే.. | Director Defense Balayya for slap Assistant

Balayya director respond on staff slap

KS Ravikumar, Balayya Slap, Balayya Slap Assistanat, Balayya Rude Behaviou, Balayya Assistant, KS Ravikumar Balayya Slap Video, KS Ravikumar About Balayya

KS Ravikumar reacts on Balakrsihna Slap his assistant at New Movie opening. Balayya just tap him all misunderstood that Ravikumar in a statement.

బాలయ్య స్టాఫ్ ను అసలు కొట్టనే లేదంట

Posted: 08/05/2017 05:14 PM IST
Balayya director respond on staff slap

చెప్పులు విప్పలేదన్న కారణంతో తన స్టాఫ్ పై బాలయ్య చేసుకోవటం నేషనల్ మీడియాలో కూడా హైలెట్ అవుతూ వస్తోంది. 102వ చిత్రం ఓపెనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోగా ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అయ్యింది.

అన్నా... ఓ రెండు చెంచాల సంస్కారం కావాలి.. అంటూ అభిమాన సంఘాల నుంచి ఓ లేఖ కూడా బాలయ్యకు బహిరంగంగా రాసేశారు. పక్కనే ఉన్న అసిస్టెంట్ ను పిలిచి కొట్టడం, ఆపై చెప్పులు విప్పించుకుని, మోయించటం వీడియలో ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కావటంతో జాతీయ మీడియా కూడా బాలయ్య వ్యవహారంపై వరుస కథనాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో పక్కనే ఉన్న దర్శకుడు కేఎస్ రవికుమార్ స్పందించాడు. బాలయ్య అస్సలు అతన్ని కొట్టలేదనే వాదిస్తున్నాడు.

బాలయ్య ఫట్ మని పీకాడు

బాలయ్య కేవలం అతన్ని తట్టాడు అంతే. ఆ మాత్రానికే కొట్టాడు.. తిట్టాడు అంటూ లేని పోని కథనాలు రాస్తున్నారు. నిజానికి బాలయ్య తన కింది వారితో చాలా పద్ధతిగా ఉంటాడంటూ వివరణ ఇచ్చాడు. అయితే ఇది నమ్మేలాగ లేకపోవటంతో ట్రోలింగ్ మొదలైపోయిది. బాలయ్య డూప్ కొట్టాడని ఒకరు, బాలయ్య తోడకు బదులు అతని తలపై కొట్టాడంటూ ఇలా జోకులు పేలుస్తున్నారు. అయితే ఇలాంటిదేదో రవి నుంచి కాకుండా బాలయ్య నుంచి వచ్చి ఉంటే కనీసం కాస్తైనా శాంతించి ఉండేవారేమో అని పలువురు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Slap Staff  Viral Video  KS Ravikumar  

Other Articles

Today on Telugu Wishesh