ఎక్స్ పోజింగ్, హైట్.. సేమ్ ప్రాబ్లమ్స్ | No Offers for Malayalam Talent Beauty in Tollywood

No crazy offers for anupama in tollywood

Anupama Parameswaran, Anupama Parameswaran Tollywood, Anupama Parameswaran Nithya Menon, Anupama Parameswaran Exposing, Anupama Parameswaran Hot Show, Anupama Parameswaran New Movie, Anupama Parameswaran, Anupama Parameswaran 2017 Movies, Anupama Parameswaran Height Problem

Anupama Parameswaran who attracted tollywood viewers with A. Aa.. Premam and Sathamanam Bhavati. But, No More Movies in tollywood because of height Problem and Glamour roles. Previously Nithya Menon Also faced the same problem. Apart this she signed for Ram Unnadi Okkate Zindagi and naga Chaitanya Untitled Project

అనుపమకు అవకాశాలు అందుకే రావట్లేదు

Posted: 08/04/2017 12:20 PM IST
No crazy offers for anupama in tollywood

తెలుగులోకి వస్తూ వస్తూనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించేసుకుంది అనుపమ పరమేశ్వరన్. మళయాళం ప్రేమమ్ క్రేజ్ తో అ.. ఆ.., ఆ తర్వాత ప్రేమమ్ చేసిన అనుకి శతమానం భవతి ఫుల్ టైం హీరోయిన్ నటనకు ఫుల్ మార్కులు వేసేసింది టాలీవుడ్. ఫ్యామిలీ లుక్ తో కుర్రకారు ప్రేక్షకుల మనసులను దోచేసిన ఈమెకు ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు. అందుకు కారణం ఏంటో చూద్దాం.

వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ లక్కీ హీరోయిన్ కు ఆ మధ్య చెర్రీ-సుక్కూ సినిమాతోపాటు, కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా ఛాన్సులు వచ్చినట్లే వచ్చి మిస్సయ్యాయి. అందం, ఆకర్షణ అంతకు మించి అభినయం ఉన్నా అవకాశం రాకపోవటానికి ఒకే ఒక్క కారణం ఎక్స్ పోజింగ్ కు నో చెప్పటమే.

తనను అప్రోచ్ అయ్యే వారు గ్లామర్ ను ఒలికించే పాత్రలతోనే వస్తుండటంతో తాను నో చెప్పాల్సి వస్తుందని ఆమె అంటోంది. అదే టైంలో తన ఎత్తు తక్కువగా ఉండటం కూడా మరో కారణం
అవుతోందని వాపోతుంది. ఇంతకు ముందు ఈ రెండు కారణాల వల్లనే నిత్యామీనన్ కు కూడా ఛాన్సులు పెద్దగా రాలేదన్న విషయం గుర్తుండే ఉంటుంది కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anupama Parameswaran  Tollywood  New Movies  

Other Articles