ఐసీయూలో వెటరన్ నటుడు.. కిడ్నీ ఫేయిల్యూర్ తో క్రిటికల్ కండిషన్ | Hospitalized Veteran Actor Condition Serious

Dilip kumar health condition serious

Dilip Kumar, Dilip Kumar Health, Dilip Kumar Serious, Dilip Kumar ICU, Dilip Kumar Kidney Failure, Dilip Kumar Renal Failure, Dilip Kumar Critical, Dilip Kumar Lilavati Hospital, Lilavati Hospital Bollywood, Bollywood Death News

Bollywood Actor Dilip Kumar Hospitalised. Dilip Kumar 94 years old who was admitted to Bandra's Lilavati Hospital on August 2, 2017, is suffering from a renal failure. Veteran Actor's Health Not Stable.

దిలీప్ కుమార్ ఆరోగ్యం సీరియస్?

Posted: 08/04/2017 11:04 AM IST
Dilip kumar health condition serious

బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించిందనే వార్తలు ఫ్యాన్స్ లో ఆందోళన నింపుతోంది. 94 ఏళ్ల ఈ నిన్నటి తరం నటుడు ఆగష్టు 2న తీవ్ర అనారోగ్యంతో ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. మూత్ర సమస్యలు, డీహైడ్రేష‌న్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం అని ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. ఇప్పటి వరకు డయాలసిస్ ప్రారంభించలేదని, కిడ్నీల పనితీరు సాధారణ స్థితికి చేరుకుంటూనే అది సాధ్యమౌతుందని చెబుతున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకున్నా, విషమంగా మాత్రం లేదని చెబుతున్నారు.

మరోవైపు క్రియాటినిన్ స్థాయులు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. కిడ్నీల పనితీరు మరింత క్షీణిస్తే మాత్రం విషమంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు కాస్త బెటర్ గా ఉందని ఆయన సతీమణి సైరా బాను పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మొత్తం బాలీవుడ్ ప్రార్థనలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilip Kumar  Health Critical  Lilavati Hospital  

Other Articles