డ్రగ్స్ కేసుతో ఇక ఇద్దరూ దూరం? | Puri Charmee Bond End due to Drug Case

Charmme puri friend ship end card

Puri Jagannadh, Puri Jagannadh Charmee Relation, Drug Case Puri Charmee End, Charmi KCR, Charmee KCR, Drug Case, KCR Tollywood Drug Case, Drug Case SIT Probe

Puri Jagannadh Actress Charmee End Their Bond due to Drug Allegations. Charmee indirectly tweets some posts in twitter. Happy with KCR Decision in Drug Case.

ఛార్మీ-పూరీ రిలేషన్ ఇంక కొనసాగేనా?

Posted: 08/01/2017 12:58 PM IST
Charmme puri friend ship end card

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ నిందితులుగా కాకుండా కేవలం బాధితులుగానే పరిగణించాలంటూ స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ ఎదుర్కున్న 12 మందితోపాటు, తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని గుబులుగా కూర్చున్న సెలబ్రిటీలంతా కాస్త రిలాక్స్ అయ్యారు.

ఈ విషయంలో సిట్ అధికారుల ముందు గంటల తరబడి విచారణ ఎదుర్కున్న పూరీ కంటే, హైకోర్టులో పిటిషన్ వేసి రచ్చ చేసి తాను అనుకున్నది సాధించిన ఛార్మీ మరింత హ్యాపీగా ఉంది. డ్రగ్ సరఫరా దారు కెల్విన్ తో ఈ హీరోయిన్ కే ఎక్కువ సంబంధాలు ఉన్నాయన్న వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిట్ అధికారుల దూకుడుకు బ్రేక్ పడటంతో ఛార్మీ వేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

ఓవైపు పూరీ పైసా వసూల్ మూవీని ప్రమోట్ చేస్తూనే.. ఇంకోపక్క వేదాంత ధోరణిలో ట్వీట్లను ఉంచుతోంది. నువ్వోక సుడిగుండం నుంచి బయటపడ్డావంటే.. అందులో ప్రయాణం నీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. అదంతా ఆ ప్రళయం ప్రభావమే అంటూ ప్రముఖ వేదాంతి హరుకి చెప్పిన ఓ సందేశాన్ని ఉంచింది. ఇవే కాదు మరో రెండు కూడా దాదాపు ఇవే అర్థం వచ్చేలా పెట్టింది. దీంతో ఇప్పటి నుంచి పూరీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకుందా? అన్న చర్చ మొదలైంది. వాళ్లిద్దరి మధ్య రిలేషన్ గురించి, పూరీ భార్య లావణ్య ఛార్మీ గురించి సినీ పెద్దల వద్ద చేసిన కామెంట్ల గురించి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Charmee Kaur  SIT Probe  

Other Articles